మంచిమాట : కుటుంబం గురించి రావణుడు చనిపోతూ చెప్పిన జీవిత సత్యాలు..

Divya

సీతను అపహరించిన తరువాత రావణుడికి అలాగే శ్రీరామునికి మధ్య జరిగిన యుద్ధ భూమిలో, లంకాధిపతి రావణ బ్రహ్మ యుద్ధభూమిలో మృత్యు శయ్యపై, అవసాన దశలో శ్రీరాముడితో చెప్పిన మాటలు వింటే మనం కూడా తప్పకుండా మారాలి అన్న ఆలోచన మొదలవుతుంది.. మరీ ముఖ్యంగా రావణుడి చనిపోయేముందు రాముడికి చెప్పిన మాట ఏమిటంటే.. రామా..! నేను నీకంటే అన్నింటిలో గొప్పవాణ్ణి. నాది బ్రాహ్మణ జాతి, నీది క్షత్రియ జాతి. నీకంటే నేను వయసులో పెద్ద వాడిని.. నా కుటుంబం నీ కుటుంబం కన్నా పెద్దది.. నా వైభవం నీ వైభవం కన్నా అధికం..

నీ అంతఃపురమే  స్వర్ణం.. కానీ నా లంకానగరమే స్వర్ణమయం.. నేను బలపరాక్రమాలలో నీకంటే శ్రేష్ఠుడిని. నా రాజ్యం నీ రాజ్యం కంటే పెద్దది.. ఇన్ని శ్రేష్టమైన విజయాలు కలిగి ఉన్నా.. నీ ముందు యుద్ధంలో ఓడిపోయాను.. దీనికి కారణం ఒక్కటే.. నీ తమ్ముడు నీ దగ్గర ఉన్నాడు.. నా తమ్ముడు నన్ను వదిలేసి వెళ్లిపోయాడు.. నీ కుటుంబ పరివారం నీతో ఉంది. కాబట్టి నువ్వు విజయాన్ని సాధించగలిగావు. నా అన్న వారు నాతో ఒక్కరు కూడా లేకపోవడం వల్ల నేను పరాజయం పాలయ్యాను .
కుటుంబ పరివారం వెంట ఉంటే ఎంతటి కష్టమైన, యుద్ధమైనా విజయం సాధిస్తుంది. అదే పరివారమే కుటుంబం అయితే ఆనందం మన వెంట ఉంటుంది.. ఎప్పుడైతే కుటుంబం దూరం అవుతుందో అప్పుడు బతుకే భారమవుతుంది.. అంటూ రావణుడు శ్రీరాముడితో చెప్పుకుంటూ అక్కడికక్కడే మరణించాడు..
ఇంతటి గొప్ప రావణబ్రహ్మ లాంటి వారే కుటుంబం తోడులేక  ఓటమిపాలయ్యారు అంటే, ఇక సామాన్య ప్రజలం మనం ఎంత.. మన బ్రతుకులు ఎంత..? అందుకే అందరం కలిసి ఉందాం.. విజయాలు సాధిద్దాం.. కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా ప్రయత్నిద్దాం.. ఎప్పుడైతే మన కుటుంబం మనకు దూరం అవుతుందో, అప్పుడు మనం బ్రతికి ఉన్నా కూడా చచ్చిన వారితో సమానం.. కాబట్టి ఎంత కష్టం వచ్చినా, నష్టం వచ్చినా కుటుంబాన్ని మాత్రం విడవకుండా ముందుకు సాగాలి..
 అప్పుడే జీవితంలో అనుకున్న దానిని తొందరగా సాధించగలము..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: