మంచిమాట: మనది కాని వస్తువుపై వ్యామోహం పెంచుకోవడం మూర్ఖత్వం!

Durga Writes

సాధారణంగా మన వస్తువు అయినా వ్యామోహం పెంచుకోకూడదు. ఎందుకంటే అది వస్తువు కాబట్టి. వస్తువుపై వ్యామోహం పెంచుకున్నాక అది పోతే ఆ బాధ ఎలా ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే వస్తువులపై వ్యామోహం పెంచుకోకూడదు. అలాంటిది మనది కానీ వస్తువుపై వ్యామోహం ఎలా పెంచుకుంటారు? 

 

మనది కాదు అని తెలిశాక కూడా ఒక వస్తువుపై వ్యామోహం పెంచుకోవడం సరైన పద్ధతి కాదు.. ఒకరి వస్తువు.. వారు ఎంతో ప్రేమగా తెచ్చుకున్నారు అలాంటి అప్పుడు నువ్వు దానిపై మనసు పడటం ఎంతవరకు సరైన పద్ధతి చెప్పు? మన వద్ద ఉన్న వాటిని మనం ప్రేమిద్దాం.. మన వద్ద ఉన్నవాటితో కాలం గడుపుదాం.. అంతేకాని వేరే వారి వస్తువులపై ప్రేమ పెంచుకోవడం అనేది ముర్కులు చేసే పని.  

 

 

మనం ఒకరిదానిపై ఆశ పడకూడదు.. నీకు నచ్చింది అంటే అది సొంతగా తెచ్చుకోవడానికి ప్రయత్నించు.. తెచ్చుకో. అంతేకాని పక్కవారి వస్తువుపై వ్యామోహం పెంచుకొని అది దక్కక మానసికంగా కుంగిపోయే కంటే ఆ వస్తువుపై ప్రేమ పెంచుకోకుండా ఉంటే సరిపోతుంది. ఎప్పుడు ఒకరి వస్తువులపై వ్యామోహం పెంచుకోకూడదు. అలా పెంచుకుంటే మీకంటే ముర్కులు మరొకరు ఉండరు. 

 

వ్యామోహం జీవితాన్ని నాశనం చేస్తుంది. తాత్కాలికంగా ఉండే మోజుతో ఏమైనా చేస్తే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఏది అయినా కూడా శాశ్వతం కాదు. నిజానికి మనుషులే శాశ్వతం కాదు.. అలాంటిది వస్తువులు శాశ్వతం అవుతాయా? ఇంకా పక్కవారి వస్తువులపై కోరిక పెంచుకుంటే మాత్రం నీది అవుతుందా? కాదు కదా! అందుకే పక్కవారి వస్తువులపై వ్యామోహం పెంచుకోకండి.. ఉన్నవాటితో సంతోషంగా ఉండండి.                      

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: