కౌగిలిలో పిండేయ్యకు.. స్టేజ్ పైనే డైరెక్టర్ కి వార్నింగ్ ఇచ్చిన నిత్యామీనన్.?

Pandrala Sravanthi
 నటి నిత్యామీనన్ ఎంత స్ట్రైట్ ఫార్ వార్డో చెప్పనక్కర్లేదు.పొట్టి పిల్ల అయినా గట్టి పిల్ల అన్నట్లు కటౌట్ తక్కువ అయినా సరే యాక్టింగ్ లో మాత్రం ఈమెని పడగొట్టేవారు లేరు అనేంతలా జీవించి మరీ నటిస్తుంది. ఇప్పటికే తన యాక్టింగ్ తో నేషనల్ అవార్డు అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఇడ్లీ కడాయి, కాదలిక నేరమిల్లై వంటి సినిమాల్లో నటించింది.ఇక జయం రవి నిత్యమీనన్ హీరో హీరోయిన్లుగా చేసిన ఈ సినిమాకి సీఎం ఉదయనిధి స్టాలిన్ భార్య అయినటువంటి కిరుతిగ ఉదయనిధి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో తాజాగా సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా జరిపారు చిత్ర యూనిట్.

 అయితే ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్లుగా చిత్ర యూనిట్ తో పాటు ఏఆర్ రెహమాన్, డైరెక్టర్ నటుడు అయినటువంటి మిస్కిన్, అనిరుధ్ రవిచంద్రన్ వంటి సెలెబ్రిటీలు వచ్చారు. అయితే ఈ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన డైరెక్టర్ నటుడు అయినటువంటి మిస్కిన్ ని నిత్యమీనన్ స్టేజ్ పైకి ఆహ్వానించింది. అలా వచ్చే సమయంలో సెలబ్రిటీలు ఎవరైనా సరే హగ్ చేసుకుంటారు. ఇక మిస్కిన్ హగ్ చేసుకుంటారు అనే విషయం ముందుగానే గ్రహించిన నిత్యమీనన్ మీరు నన్ను కౌగిలించుకొని మీ కౌగిలిలో బంధించి పిండేయకండి.. నేను ఈవెంట్ కోసం రెడీ అయి వచ్చాను అంటూ సరదాగా మాట్లాడింది.

ఇక నిత్య మీనన్ మాటలతో అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వేశారు. అయితే ఎవరినైతే హగ్ చేసుకోకు అని నిత్యమీనన్ చెప్పిందో మళ్లీ ఆయన దగ్గరికే వెళ్లి కిస్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక మిస్కిన్ కేవలం డైరెక్టర్ గానే కాకుండా నటుడుగా కూడా పలు సినిమాల్లో అలరించారు. ఇక కాదలిక నేరమిల్లై మూవీ ఈనెల 14న విడుదల కాబోతోంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: