మంచిమాట: నింద నిజమైతే తప్పక దిద్దుకో.. అబద్దమైతే నవ్వేసి ఊరుకో!
నేటి మంచిమాట.. నింద నిజమైతే తప్పక దిద్దుకో.. అబద్దమైతే నవ్వేసి ఊరుకో! అవును.. మీపై పడిన నిందలు నిజం అయితే తప్పక దిద్దుకోవాలి.. లేదంటే సోది అని మానేయాలి. అంతే తప్ప అయినా దానికి కానీ దానికి కోపగించుకుంటూ పోతే మీరు చేయనివి కూడా వాళ్ళు అంటూనే ఉంటారు. అందుకే నిందలు నిజం అయితే కచ్చితంగా సరిదిద్దుకోవాలి. లేదంటే నవ్వేసి సైలెంట్ గా ఉండలి.
ఇప్పుడు సినిమా హీరోలను ఉదాహరణ తీసుకోండి.. వారు వారిపైన ఎన్ని గాసిప్స్ వస్తాయి? పేపర్ లో, వెబ్సైట్స్ లో, యూట్యూబ్ లో ఇలా చెప్పుకుంటూ పోతే మనుషులు చదివే ప్రతి చోటా గాసిప్స్ వస్తాయి. కానీ వారు అన్నిటికి స్పందించరు . ఏవి అయితే అవసరమో వాటికీ మాత్రమే స్పందిస్తారు. నువ్వు లక్ష అనుకో నాకు ఎలాంటి సంబంధం లేదు అంటారు.
అలానే మనం కూడా.. నిందలు వేస్తే అవి నిజామా కదా? అనేది తెలుసుకోవాలి. నిజం అయితే మనల్ని మనం సరిదిద్దుకోవాలి. అదే అబద్దం అయితే నవ్వేసి సైలెంట్ గా ఉండాలి. అప్పుడే అంతేకాని ఉన్నవాటికి లేని వాటికీ స్పందించకూడదు.. మన స్పందనకు ఒక విలువ ఉంటుంది. మన నవ్వుకు ఒక విలువ ఉంటుంది. మన కోపానికి విలువ ఉంటుంది. ఊరికే వాటిని తెలిపి విలువ తగ్గించుకునే బదులు అవసరమైన వాటికే స్పందించి విలువను పెంచుకుందం.