ఛీ..ఛీ...రష్మిక పై మోజుపడ్డ ఆ లేడీ నటి..?

Veldandi Saikiran
నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. కిర్రిక్ పార్టీ సినిమాతో తన కెరీర్ ప్రారంభించిన రష్మిక చలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ సినిమా అనంతరం వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ చిత్రాలలో నటించారు. పుష్ప సినిమాతో ఏకంగా నేషనల్ క్రష్ గా మారిపోయారు. పాన్ ఇండియా రేంజ్ లో రష్మిక తనకంటూ మంచి స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.

ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల జాబితాలో రష్మిక ఒకరు. యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని 2023ని విజయవంతంగా ముగించింది. ఇప్పుడు వేరే లెవెల్ హిట్ తో 2024కు వీడ్కోలు పలుకుతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప-2: ది రూల్ తో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక అదిరిపోయే హిట్ ను సొంతం చేసుకుంది. శ్రీవల్లిగా ప్రతి ఒక్కరిని మెప్పించారు. తన అద్భుతమైన యాక్టింగ్ తో సర్వత్ర ప్రశంసలు అందుకుంటుంది. రష్మిక వివిధ భాషలలో తన టాలెంట్ నిరూపించుకుంటుంది.

అలాగే పుష్ప-2 విజయంతో 2024లో రష్మిక మరింత గొప్ప స్థాయికి చేరుకుందని చెప్పాలి. ఈ సక్సెస్ తో రష్మిక కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీని ఏలడం కన్ఫామ్ అని చెప్పవచ్చు. కాగా, హీరోయిన్ రష్మికతో ప్రేమలో పడ్డానంటూ వెల్లడించింది ప్రముఖ దక్షిణాది నటి సంజీదా షేక్. రష్మిక నటనకు పిచ్చిగా అభిమానిని అయిపోయానంటూ సంజీద అంటోంది. మొదటిసారి యానిమల్ లో రష్మిక అద్భుత నటనకు ఫిదా అయిపోయానని తెలియజేసింది. అందులో రణబీర్ తో గొడవ పడే సన్నివేశాలలో రష్మిక హావభావాలు, నటన మరిచిపోలేని విధంగా ఉన్నాయని సంజీద చెప్పింది.

రణబీర్ తో ఆ ఒక్క సన్నివేశం తన గురించి నా ఆలోచనను మార్చివేసిందని సంజీద అన్నారు. ఆమె చాలా మంచి నటీమణుల కేటగిరీలో ఉన్నారు. ఇటీవల నేను రష్మికను పుష్ప-2 సినిమాలోనూ చూశాను. తన పట్ల నా గౌరవం మరింత పెరిగింది. నాకు మంచి నట ప్రదర్శనలు చూడడం అంటే చాలా ఇష్టం. పుష్ప-2లో అల్లు అర్జున్ హీరో అయితే రష్మిక ఆ చిత్రంలో హీరోయిన్ గా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని సంజీదా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: