వావ్: చరణ్ ఫాన్స్ కి గుడ్ న్యూస్..దేశంలోనే అతిపెద్ద కటౌట్ ఓపెనింగ్.. ఇదిగో..!

Divya
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ,దిల్ రాజు కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్. డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించక సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా భారీ ఎత్తున ప్రమోషన్స్ కోసం చిత్ర బృందం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికాలో కూడా నిర్వహించారు.. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున రామ్ చరణ్ కటౌట్లు ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. విజయవాడలో రికార్డు స్థాయిల తాజాగా ఒక భారీ కటౌట్ ని ఏర్పాటు చేసి ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది.

విజయవాడలోని బృందావన కాలనీ వజ్ర మైదానంలో ఈ భారీ కటౌట్ని సైతం ఏర్పాటు చేసినట్లుగా సమాచారం.. అయితే ఇప్పటివరకు ఏ ఇండియన్ హీరో పెట్టని 256 అడుగుల భారీ కటౌట్ని సైతం రామ్ చరణ్ అభిమానుల ఏర్పాటు చేశారు. ఈ కటౌట్ ని యువశక్తి అభిమాన సంఘం ఆధ్వర్యంలో జరిగిందట. రామ్ చరణ్ పైన తమకు ఉన్న అభిమానంతోనే ఇలా చేశామని వెల్లడించారు. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన కటౌట్ ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. సినీ ప్రముఖుల ఆధ్వర్యంలో ఈ భారీ కటౌట్ని సైతం ఆవిష్కరించినట్లు తెలుస్తోంది.

సుమారుగా వారం రోజుల పాటు కష్టపడి ఈ భారీ కటౌట్ ని ఏర్పాటు చేసినట్లుగా అభిమానులు వెల్లడిస్తున్నారు చెన్నై నుంచి ప్రత్యేక టీమ్ ని ఇందులో భాగం చేసుకున్నామని అత్యంత ఖరీదుతో ఈ కటౌట్ ని ఏర్పాటు చేసినట్లుగా అభిమానులు వెల్లడిస్తున్నారు. ఈ విషయం విన్న మెగా అభిమానుల సైతం వీరికి ప్రశంసలు కురిపిస్తున్నారు. రామ్ చరణ్ కు జోడిగా కియారా అద్వానీ రెండవసారి నటిస్తూ ఉన్నది.అలాగే ఇందులో ఎస్ జె సూర్య, శ్రీకాంత్, అంజలి, కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. అలాగే చాలామంది నటీనటులు నటిస్తున్నారు. రామ్ చరణ్ ఏకంగా 200 రోజులు ఈ సినిమా షూటింగ్లోనే నటించారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: