అలాంటి సర్జరీ చేయించుకోబోతున్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య..ఫ్యాన్స్ కి ఊహించని బిగ్ షాక్..!?

Thota Jaya Madhuri
ఏంటి.. నిజంగానే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అలాంటి సర్జరీ చేయించుకోబోతున్నాడా..? ఈ వయసులో ఇప్పుడు ఎందుకు ఇలా..? అంటూ కోలీవుడ్ జనాలు మాట్లాడుకుంటున్నారు.  మనకు తెలిసిందే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఆఖరిగా నటించిన మూవీ "కంగువ". ఈ సినిమా భారీ డిజాస్టర్ టాక్ అందుకుంది . కంగువా సినిమా పై కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఎన్ని అంచనాలు పెట్టుకొని ఉన్నాడో అందరికీ తెలిసిందే . అయితే అంచనాలు మొత్తం తలకిందులు అయిపోయాయి . 


సినిమా డిజాస్టర్ కా బాప్ అనే రేంజ్ లో నెగిటివ్ టాక్ దక్కించుకుంది . కలెక్షన్స్ పరంగా కూడా మొత్తం ఫ్లాప్ అయిపోయింది . దీంతో కోలీవుడ్ హీరో సూర్యను బాగా ట్రోల్ చేశారు జనాలు. కొంతమంది సినీ ప్రముఖులు కోలీవుడ్ హీరో సూర్య పై పర్సనల్ గా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ కూడా ఇచ్చారు . దీంతో సూర్య కెరియర్ ఖతమ్ అనుకున్నారు . కానీ సూర్య మాత్రం ఏ మాత్రం నిరాశ చెందకుండా నెక్స్ట్ సినిమాలను చకచకా కమిట్ అవుతూ .. ఆ సినిమాలను సెట్స్ పైకి తీసుకొచ్చే పనిలో ఉన్నాడు .


అయితే ఇలాంటి మూమెంట్లోనే కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరో సూర్య గురించి ఓ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. కోలీవుడ్ హీరో సూర్య త్వరలోనే ఫారిన్ కంట్రీ లో ఓ  సర్జరీ చేయించుకోబోతున్నాడట . అది కూడా తన భుజానికి . "కంగువ" సినిమా షూటింగ్ టైంలో ఆయనకు ఒక చిన్న ప్రమాదం జరిగిందట. అప్పటినుంచి చాలా చాలా భుజం నొప్పిగా ఉందట . డాక్టర్స్ ని సంప్రదించగా మైనర్ సర్జరీ చేయించుకోవాలి అంటూ సజెస్ట్ చేశారట. ఇన్నాళ్లు నెగ్లెట్  చేస్తూ వచ్చిన సూర్య ఇప్పుడు ఆ సర్జరీ చేయించుకోవడానికి డిసైడ్ అయ్యారట . త్వరలోనే ఫారిన్ కంట్రీ కి వెళ్ళి మరి ఆ మైనర్  సర్జరీ చేయించుకోబోతున్నారట . దానికి పెద్దగా బెడ్ రెస్ట్ ఏమి అవసరం లేదు అని ..ఒక 15 రోజులు ఇంట్లో ఉండి ఆ తర్వాత షూటింగ్ కి వెళ్తే అంత సెట్ అవుతుంది అని.. బరువులు అంతా మోయకుండా ..హ్యాండ్ ని రెస్ట్ గా పెట్టుకుంటే చాలు అంటూ డాక్టర్ లు సజెస్ట్ చేస్తున్నారట . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు కోలీవుడ్ హీరో సూర్యకి సంబంధించిన ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: