లాస్ట్‌ టెన్‌లోని ముగ్గురు మంత్రులు ఎవరంటే...

Krishna A.B
చంద్రబాబునాయుడు మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణకు ముహూర్తం పెట్టుకున్న నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారో ఆయన చేయించిన సర్వే ఫలితాలను వెల్లడించేశారు. తమాషా ఏంటంటే.. తన పార్టీ ఖర్చుతో.. ప్రత్యర్థి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారో కూడా ఆయన సర్వే చేయించారు. ఇందులో చాలా ఆశ్చర్యకరమైన వివరాలు ఉన్నాయి. టాప్‌టెన్‌లో స్థానం దక్కించుకున్న మంత్రి సీఎం చంద్రబాబు ఒక్కడే. అయితే లాస్ట్‌ టెన్‌ లో మాత్రం ముగ్గురు మంత్రులు ఉన్నారుట. చంద్రబాబు నాయుడు పునర్వ్యవస్థీకరణ పేరిట ఖచ్చితంగా కొందరిపై వేటు వేస్తారనే ప్రచారం సాగుతుండగా.. ఆ జాబితాలో లాస్ట్‌ టెన్‌లో ఉన్న ముగ్గురు మంత్రులు ఎవరనేది కూడా విశ్వసనీయంగా తెలుస్తోంది. 


పత్రికల్లో వచ్చిన వార్తలను బట్టి.. లాస్ట్‌టెన్‌లోని ముగ్గురిలో ఒకరు ఉత్తరాంధ్రకు మిగతా ఇద్దరు రాయలసీమకు చెందిన వారని మాత్రం ప్రచారం జరిగింది. అయితే ఆ ముగ్గురూ కిమిడి మృణాళిని, పల్లె రఘునాధరెడ్డి, కె.ఇ.ఇకృష్ణమూర్తి అని పార్టీలో ప్రచారం జరుగుతోంది. 


బాలయ్య, చంద్రబాబుకంటే రెండుర్యాంకులు పైనే ఉండడం విశేషం. ప్రధానప్రతిపక్ష నేత జగన్‌కు పులివెందులలో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉందని అనుకుంటారు గానీ.. చంద్రబాబు ఇచ్చిన ర్యాంకుల్లో ఆయన 131 వ స్థానంలో ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ముత్యాలనాయుడు (మాడుగుల) మొదటిస్థానంలో ఉన్నారు. ఎమ్మార్వో పై దాడిచేసి.. నానా బీభత్సం సృష్టించి వివాదాల్లో ఇరుక్కున్న చింతమనేని ప్రభాకర్‌ టాప్‌ టెన్‌లోనే (3) ఉన్నారు. తమాషా ఏంటంటే.. చంద్రబాబుకు నూరుశాతం రిజల్టు ఇచ్చిన వెస్ట్‌గోదావరి జిల్లాలో ఏకంగా ఆరుగురు ఎమ్మెల్యేలు టాప్‌ టెన్‌లో ఉన్నారుట. అదే చంద్రబాబుకు వెస్ట్‌ గోదావరి అంటేనే ఇష్టం అని కర్నూలు జిల్లా అంటే ఇష్టం లేదని ప్రకటించిన డిప్యూటీ సీఎం కెఇ కృష్ణమూర్తి లాస్ట్‌ టెన్‌లో ఉన్నారుట. సమాచార మంత్రి పల్లె రఘునాధరెడ్డి అయితే.. ఏకంగా 175 వస్థానంలో ఉన్నారని కూడా ఒక పుకారు వినిపిస్తోంది. 


మొత్తానికి ఇలా మంత్రులకు హింట్లు ఇవ్వడం ద్వారా ఎవరెవరికి తోక కత్తిరించాలో.. ఎవరిమీద ఏకంగా వేటు వేయాలో కసరత్తు చేసుకోవడానికి చంద్రబాబు పని ఈజీగా అయిపోతుందని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇలాంటి నివేదికల్ని ముందుగా లీక్‌ చేయడం వలన.. రేపు చర్యలు తీసుకున్నా.. వారు పెద్ద వ్యతిరేకించకుండా మౌనం పాటిస్తారని.. ఇదంతా చంద్రబాబు వ్యూహ చాతుర్యానికి నిదర్శనం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయతే టాప్‌ టెన్‌లో ఉన్న వారిలో కనీసం ఒక్కరికైనా కొత్తగా మంత్రి పదవి దక్కే చాన్సుంటుందా అంటే మాత్రం.. 'ఆ పదవులకు ప్రాతిపదిక అది కాదుకదా' అనే సమాధానం పార్టీలో వినిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: