ఆ రెండు పార్టీలూ మళ్లీ దగ్గర అయ్యాయోచ్..!

Padmaja Reddy
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ, శివసేనల మధ్య జరిగిన రచ్చను ఎవరూ అంత ఈజీగా మరిచిపోలేరు. లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు జరిగిన అతి తక్కువ వ్యవధిలోనే జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ, శివసేనలు వైరిపక్షాలు అయ్యాయి. అంతకు ముందు లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో కలిసిపోటీ చేసిన ఈ రెండు పార్టీలూ మహారాష్ట్ర అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల సమాయానికి శత్రువులయ్యాయి. ఎన్నికల తర్వాత భారతీయ జనతాపార్టీకి సొంతంగా మెజారిటీ లేకపోయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శివసేన మద్దతును ఇవ్వడానికి రెడీగా ఉన్నాకూడా బీజేపీ వాళ్లు ఆ పార్టీకి ప్రాధాన్యతను ఇవ్వలేదు. ఇదే సమయంలో బీజేపీకి ఎన్సీపీ దగ్గర కావడానికి ప్రయత్నించింది. మరి శత్రుపక్షం లాంటి ఎన్సీపీని చేరదీయడానికి బీజేపీ కూడా సిద్ధపడింది. శివసేనను దూరం పెట్టి ఎన్సీపీ బయటి నుంచి ఇచ్చిన మద్దతుతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకొంది. ఈ విషయంలో విమర్శలు వచ్చినా.. బీజేపీ వెనుకాడలేదు. అయితే ఎన్సీపీ ఇంతలోనే వ్యూహం మార్చింది. బీజేపీకి తమ మద్దతులేదని ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీజేపీకి తిరిగి శివసేన మద్దతు తప్పనిసరి అవుతోంది. ఈ నేపథ్యంలో కమలం పార్టీ ఆ మరాఠా పార్టీకి స్నేహ హస్తం అందించడానికి సిద్ధమని ప్రకటించింది. రాష్ట్ర క్యాబినెట్ లో బెర్తులిస్తామని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను శివసేన కూడా స్వాగతిస్తోంది. మొత్తానికి ఈ విధంగా ఆ రెండు పార్టీలూ మళ్లీ దగ్గరయ్యాయి!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: