48 గంటల పాటు మంచినీటి స‌ర‌ఫ‌రా బంద్

DRK Raju
గ్రేటర్‌ హైదరాబాద్ నగర ప్రజల దాహార్తి తీర్చడంలో ముఖ్య భూమిక పొషిస్తున్న గోదావరి జలాల సరఫరాలో బుధవారం(అక్టోబర్ 16 వ తేదీ)  ఉదయం ఆరు గంటల నుంచి 48 గంటలు అంతరాయం ఏర్పడనుంది.  ఇంతకు ముందు చెప్పినట్లు మూడు రోజులు కాకుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా 48 గంటల్లో పైపులైను చోటుకి మార్చే ప్రక్రియ పూర్తి చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు పథకం ఫ్యాకేజీ-13లో భాగంగా ఇరిగేషన్‌ శాఖ గ్రావిటీ కెనాల్‌ నిర్మాణం జరుగుతుంది. గజ్వేల్‌ మండల పరిధిలోని కోడకండ్ల గ్రామం వద్ద నగరానికి వచ్చే గోదావరి 3000 ఎంఎం డయా ఎంఎస్‌ పైపులైన్‌ ఈ కెనాల్‌ నిర్మాణానికి అడ్డుగా వస్తున్నది. దీంతో ఈ భారీ పైపులైన్‌ ఇతర చోటికి మారుస్తున్న క్రమంలో ఇరిగేషన్‌ శాఖ విజ్ఞప్తి మేరకు జలమండలి అధికారులు మూడు రోజుల పాటు షట్‌డౌన్‌ తీసుకోవడం జరుగుతుంది.


ఈ నెల 16వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి 18వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు 48 గంటలు నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుంది.  అభివృద్ధి పనుల్లో భాగంగా నీటి తరలింపులో అంతరాయం ఏర్పడింది, ప్రభావిత ప్రాంతాల్లో నీటి ఎద్దడి లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు జలమండలి  ఏర్పాట్లు చేస్తుంది. అంత‌రాయం క‌లిగే ప్రాంతాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఓ అండ్ ఎం డివిజన్నెం.6 :  ఎర్రగడ్డ,  బోరబండ,  ఎల్లారెడ్డిగూడ, యూసుఫ్‌గూడ, ఎస్‌ఆర్‌ నగర్‌, ఆమీర్‌పేట, బంజారాహిల్స్‌, సనత్‌నగర్‌,  జూబ్లీహిల్స్‌.ఓ అండ్ ఎమ్ డివిజన్ నెం. 9 : కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మూసాపేట, {{RelevantDataTitle}}