ఔను...ఆ జ‌ర్న‌లిస్ట్‌ను నేనే చంపించాను

Pradhyumna
సౌదీ అరేబియా కేంద్రంగా సంచ‌ల‌న అంశం వెలుగులోకి వ‌చ్చింది. వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది.గతేడాది అక్టోబర్ ఒకటో తేదీన వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి దారుణ హత్యకు తనదే బాధ్యత అని సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించారు. తన పర్యవేక్షణలోనే ఖషోగ్గిని టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోని సౌదీ దౌత్య కార్యాలయంలో తమ దేశ అధికారులు అంతమొందించారని ఆయ‌న ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.


అక్టోబర్ ఒకటో తేదీన ఖషోగ్గి హత్య జరిగి ఏడాది పూర్తి కానుంది. ఈ నేప‌థ్యంలో పీబీఎస్ డాక్యుమెంటరీ చిత్రం ది క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ సౌదీ అరేబియా కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో  సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ సంచ‌ల‌న విష‌యాలు చెప్పారు. అమెరికా నిఘా సంస్థ సీఐఏతోపాటు పాశ్చాత్య దేశాల ప్రభుత్వాలు కూడా సౌదీ యువరాజు ఆదేశాల మేరకే ఖషోగ్గి హత్య జరిగిందని పేర్కొన్నా.. అందులో ఆయన పాత్రేమీ లేదని సౌదీ అధికారులు కొట్టిపారేశారు. కాగా, అక్టోబర్ ఒకటో తేదీన ఖషోగ్గి హత్య జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ వీడియో ప్రసారం కానుంది. 


మ‌రోవైపు ఐరాస నివేదిక ప్ర‌కారం...గతేడాది అక్టోబర్ రెండో తేదీన ఖషోగ్గి రాక ముందే సౌదీ యువరాజు సీనియర్ సలహాదారు (నిఘా అధికారి) మహేర్ ముత్రేబ్, సౌదీ అంతరంగిక వ్యవహారాలశాఖ ఫోరెన్సిక్ డాక్టర్ సలాహ్ అల్ తుబైగీలు ఇస్తాంబుల్‌లోని తమ దౌత్య కార్యాలయం వద్ద కాచుకుని కూర్చున్నారని ఐరాస నివేదిక వెల్లడించింది. ఖషోగ్గి రాక ముందు ఆయన పేరెత్తకుండానే తుబైగీతో ముత్రేబ్ మాట్లాడుతూ బలి ఇచ్చే గొర్రె వచ్చిందా? అని అన్నట్లు సమాచారం. ఆ తర్వాత రెండు నిమిషాలకే సౌదీ దౌత్య కార్యాలయంలోకి ఖషోగ్గి ప్రవేశించారు. అంతకుముందు, ఖషోగ్గిని హత్య చేసిన తర్వాత ట్రంక్ పెట్టెలో మృతదేహాన్ని తరలించొచ్చా? అని ముత్రేబ్ ప్రశ్నిస్తే, చాలా ఎక్కువ బరువు ఉంటుందని సాలాహ్ అల్ తుబైగీ అన్నారని తెలుస్తున్నది. ఖషోగ్గి మృతదేహాన్ని ముక్కలుముక్కలు చేసి పారవేయడంలో తుబైగీ కీలకంగా వ్యవహరించారని ఐరాస నివేదిక తెలిపింది. ఖషోగ్గిని హత్య చేస్తున్నప్పుడు సౌదీ సీనియర్ అధికారులకు, యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌కు మధ్య ఫోన్‌లో సంప్రదింపులు జరిగాయని ఐరాస నివేదిక తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: