వానొస్తే ఇళ్లూ..వీధులు చెరువుల్లా మారుతున్నాయ్..?

satvika
చిటపట చినుకులు పడుతూ ఉంటె.. చెలికాడే సరసన ఉంటె.. అనేది ఒకప్పటి మాట.. ప్రస్తుతం వానొస్తుంది అంటే ఆమ్మో వానా.. అంటూ ప్రాణాలను అర చేతుల్లో పెట్టుకుంటున్నారు నగర వాసులు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం హైదరాబాద్ జంట నగరల్లో పరిస్థితి కూడా దారుణంగా మారింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాద్ హతాలాకుతలమైంది. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో సాధారణ ప్రజల ఇబ్బందులు ఘోరంగా మారాయి. 


ఎందరికో  జీవనాధారాన్ని అందిస్తున్న ఈ హైదరాబాద్ మహా నగరంలో ఒక్క సారి వర్షాలు పడితే మాత్రం ఆ పరిస్థితి వర్ణనాతీతం. ఎటు చూసిన కూడా నీళ్లు, ఎక్కడిక్కడ పేరుకుపోయిన చెత్తచెదారం, కళ్ళు కూడా పెట్టడానికి వీలు లేకుండా మారిన రోడ్లు సాధారణ ప్రజలను ఇక్కట్లకు గురి చేస్తున్నాయి. చిరు వ్యాపారుల పరిస్థితి మరింత ఘోరం. రెక్కాడితే కానీ, డొక్కాడని వాళ్లకు ఈ వార్షాలు నష్టం కలిగించాయనే చెప్పాలి.  


ఇకపోతే నిన్న సాయంత్రం నుండి ఆగకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ రవాణా వ్యవస్థ స్తంభించింది. డైలీ ఉద్యోగాలకు వెళ్లే వారు సమయానికి చేరుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇకపోతే ఈ వర్షాలకు హైదరాబాద్ చుట్టూ ఉన్న చెరువులు జలకళ సంతరించుకున్నాయి. హుస్సేన్ సాగర్ కు అధిక వరద నీరు వచ్చి చేరుతుంది. 



ఈ వర్షాల కారణంగా ఎన్నో ఇల్లు నేలమట్టం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు పూర్తిగా మునిగి పోయాయి. లోతట్టు ప్రాంతాలే కాకుండా హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ వంటి ఏరియాలు కూడా నీరు చేరడంతో ఎక్కడిక్కడ పూర్తి రోడ్లు బ్లాక్ అయ్యాయి. ట్రాఫిక్ బాధలు మరింత పెరగడంతో హైదరాబాద్ వాసులు మెట్రోలను ఆశ్రయించారు. దానితో మెట్రో స్టేషన్లన్నీ జనంతో కిక్కిరిశాయి. ఇలాగే మరో రెండు రోజులు కనుక వర్షాలు కొనసాగితే హైదరాబాద్ పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: