111 ఏళ్లలో ఇదే మొదటిసారి..!!

Balachander
గత కొంతకాలంగా దేశంలో వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి.  కుండపోతగా వర్షం కురుస్తుండటంతో జలాశయాలు నిండుకుండల్లా కనిపిస్తున్నాయి.  ఉత్తరాదిని సైతం వర్షాలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే.  గత పదేళ్ల నుంచి రాష్ట్రంలో పెద్దగా వర్షాలు లేవు.  అప్పుడెప్పుడో 2009లో భారీ వర్షాలు కురిశాయి. మరలా ఇప్పుడు వరసగా వర్షాలు కురుస్తున్నాయి.  వానాకాలంలో వానలు, ఎండాకాలంలో ఎండలు ఇలా కాలాన్ని బట్టి వర్షాలు కురిసి చాలా కాలమే అయ్యింది.  


ఇదిలా ఉంటె, సెప్టెంబర్ లో ఈ వర్షాలు మరింత ఎక్కువయ్యాయి.  దేశవ్యాప్తంగా స్థాయికి మించి వర్షాలు కురిశాయి.  గత కొన్ని రోజులుగా హైదరాబాద్ ను వానలు ముంచెత్తుతున్నాయి. రోజులు రెండు మూడు గంటల పాటు వర్షం కురుస్తున్నది.  ఈ వర్షం దాటికి లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి.  జనజీవనం అస్తవ్యస్తం అవుతున్నది.  గట్టిగా గంటపాటు వర్షం కురుస్తేనే రోడ్లు చెరువులను తలపించే విధంగా మారిపోతున్నాయి.  


అలాంటి గంటల తరబడి వర్షం కురిస్తే ఇంకేమైనా ఉన్నదా.  అసలే హైదరాబాద్ లో డ్రైనేజ్ వ్యవస్థ అంతంతమాత్రంగానే ఉన్నది.  ఈ వర్షాల కారణంగా డ్రైనేజిలు పొంగి పొర్లుతున్నాయి.  ఎక్కడికక్కడ నాళాలు పొంగిపోతున్నాయి.  ఈ సెప్టెంబర్ లో భారీ వర్షపాతం నమోదైంది.  గత 111 ఏళ్లలో ఈ స్థాయిలో వర్షం కురవడం ఇదే మొదటిసారి అని అధికారులు చెప్తున్నారు.  నగరంలో మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.  ప్రజలు అప్రమతంగా ఉండాలని సూచిస్తోంది.  


వానాకాలం వస్తే రోడ్ల పరిస్థితి గురించి చెప్పాల్సిన అవసరం లేదు.  కాసేపు వాన కురిస్తే గంటల కొద్ది ట్రాఫిక్ జామ్.  పాత ఇల్లు కూలిపోతుంటాయి.  కొత్తగా కట్టుకునే ఇల్లు సైతం ఈ వనాల ధాటికి కూలిపోతున్నాయి.  నెలలో ఒకరోజు వర్షం కురిస్తే బాగుటుంది అంతేగాని.. ఇలా రోజుల తరబడి వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటో అర్ధం కావడం లేదు. సూర్యుడు ముఖం చాటేయడంతో ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: