జైట్లీ అంత్యక్రియలకు హజరైన దొంగలు..?

venugopal Ramagiri
ఓ మహానేత మరణం దొంగల పాలిట వరమైంది.ఆదివారం ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్ లో మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరిగిన విషయం తెలిసిందే,అంత్యక్రియలకు పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు,కార్యకర్తలు,వివిధ పార్టీల ప్రముఖులు హాజరయ్యి జైట్లీకి కడసారి వీడ్కోలు పలికారు.అయితే ఆ సమయంలో అనేకమంది తమ ఫోన్లు పోగొట్టుకున్నారు.వివరాలను తెలుసుకుంటే అనారోగ్యం కారణంగా బీజేపీ సీనియర్‌ నేత,కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ కన్నుమూసిన సంగతి తెలిసిందే,ఈ క్రమంలో ఆయన అంత్యక్రియలను ఢిల్లీలోని నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో నిర్వహించగా,పెద్ద సంఖ్యలో అభిమానులు,కార్యకర్తలు తరలి రాగా యమునా నది ఒడ్డున ఉన్న నిగంబోధ్‌ ఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను ఘనంగా నిర్వహించారు.



ఇక అరున్ జైట్లీ గారి అంత్యక్రియల్లో చిన్న అపశృతి దొర్లిందట.నిగమ్ బోధ్ ఘాట్ లో ఆదివారం జరిగిన దహనసంస్కార కార్యక్రమంలో పదకొండు మంది  ప్రముఖులు తమ ఫోన్లు పోగొట్టుకున్నారట..చరవాణిలు పోగొట్టుకున్న వారిలో పతంజలి ప్రతినిధి,ఎస్ కే తజరవాలా,బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రియో తదితరులు ఉన్నారట,ఇక తమ ఫోన్ దొంగలించబడిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు వారు. అంత్యక్రియల సమయంలో ఏ ప్లేస్ లో నుండి ఆ సెల్‌ఫోన్స్ దొంగిలించబడ్డాయో గూగుల్ మ్యాప్ ట్రాకింగ్ ద్వారా గుర్తించినట్లు వివరించారు.దీనిపై ఢిల్లీ పోలీసులకు కంప్లెయింట్ ఇవ్వనున్నట్లు తెలిపారు..



ఇక వరుసగా బీజేపీ నేతలు ఆస్పత్రిపాలవడం,ప్రాణాలు కోల్పోవడం జరుగుతున్న క్రమంలో మరో షాక్ న్యూస్ కమలదళాలను కలవర పెడుతుంది.ఆ పార్టీకి చెందిన మరో ముఖ్యనేత మురళీ మనోహర్ జోషీ ఆసుపత్రిపాలు కావడంతో ఆ పార్టీ నేతలు కాస్త ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.కేంద్ర ఆర్థిక శాఖమాజీ మంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ముగిసిన తర్వాత బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి అనారోగ్యంకారణంగా ఆస్పత్రిలో చేరారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: