బీచ్ కి వెళ్లాలంటే భయపడుతున్న చెన్నై వాసులు..!

Durga Writes
సాయంత్ర సమయంలో బీచ్ రోడ్డులో నడుస్తూంటే అలలు అలా కాళ్ళను తాకుతుంటే ఎంత హాయిగా ఉంటుంది. బీచ్ ప్రేమికులకు ఈ అనుభవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలానే చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డు వెంబడి బీచ్ లో కూడా గత ఆదివారం రాత్రి అలలు వచ్చాయి. కానీ ఆ అలలను చూసి ప్రజలు, సందర్శకులు భయాందోళనకు గురవుతున్నారు.  


సముద్రంలో సరికొత్త రంగులతో అలలు కనువిందుచేయడంతో సందర్శకులు కొంత భయాందోళన చెందారు. ఆ అలలు అందంగా ఉన్నప్పటికీ భయానికి గురిచేస్తున్నాయి. చెన్నై బీచ్ లో గత ఆదివారం రాత్రి నీలిరంగు అలలు తీరం వైపు కొట్టుకువచ్చాయి. చీకట్లో మెరుస్తూ వచ్చిపోయిన నీలిరంగు అలలు సందర్శకులను కన్నార్పకుండా చేశాయి. 


అరుదుగా వచ్చే ఈ అలల ఫొటోలు, వీడియోను సందర్శకులు తమ సెల్ ఫోన్లలో బందించారు. అయితే ఈ అలల వెనుక చాలా పెద్ద ప్రమాదమే పొంచి ఉందని  నిపుణులు హెచ్చరిస్తున్నారు. బయో లుమినిసెన్స్‌గా పేర్కొనే ఈ పరిణామం సముద్రంలోని నోక్టిలూకా సింటిలియన్స్‌ అనే సూక్ష్మజీవుల కారణంగా ఏర్పడుతుందని,  ఈ సూక్ష్మజీవులు ఉన్న ప్రాంతంలో చేపలు ఇతర జలచరాలు సైతం జీవించలేవని నిపుణులు తెలుపుతున్నారు. అలలు నీలి రంగులోకి మారడం ప్రమాదకరమని వారు అబిప్రాయపడుతున్నారు. ఈ అలల ద్వారా చెన్నై ప్రజలను సముద్రం హెచ్చరిస్తుంది అని నిపుణులు చెప్తున్నప్పటికీ ఈ అలలను చుడానికి ప్రజలు ముందు వస్తున్నారు.  


వర్షం ఎక్కడ పడినా వరద వచ్చేది ఆ నదికే పప్పుగాడి అనుచరులకు ఆమాత్రం జ్ఞానం కూడా లేదు.
బోల్లోడు ఉంటే పక్కరాష్ట్రాల్లో కూడా సరియిన వర్షాలు పడని దుస్తితి. ఇప్పుడు రైతులు సంతోషంగా ఉన్నారు.
ఇక లంక గ్రామాలు వరదలో మునగడం మామూలే ఇదేదో ఎప్పుడూ జరగనట్లు మాట్లాడడం తెలుగుదొంగలకే తెలుసు

— Annaji Sekhar (@g_annaji) August 21, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: