కచ్ సరిహద్దులో హై అలర్ట్

Edari Rama Krishna
ఎప్పటి నుంచో భారత్ పై విషం కక్కుతుంది దాయాది దేశం పాకిస్థాన్.  ప్రతి చిన్న విషయంలోనూ విభేదిస్తూ వైరాన్ని పెంచుకుంటుంది పాక్.  భారత దేశం ఎంత స్నేహ హస్తాన్ని అందించినా..శత్రుదేశంగానే భావిస్తుంది.  ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటి నుంచో కాంట్రవర్సీగా ఉన్న కాశ్మీర్ వివాదం..370 ఆర్టికల్ రద్దు చేయడం పాక్ కి మింగుడు పడటం లేదు.  అప్పటి నుంచి ఎన్ని రకాలుగా సంచలన వ్యాఖ్యలు చేయాలో అన్ని రకాలుగా చేస్తూ వస్తుంది.  ఒకప్పుడు భారత్ కార్గిల్ యుద్దంతో పాకిస్థాన్ కి దిమ్మతిరిగే బుద్ది చెప్పింది. 

దాంతో చాలా కాలం సైలెంట్ గా ఉంటూ..లోలోపల పన్నాగాలు పన్నతూ వస్తుంది.  పాక్ లో కొన్ని ఉగ్రవాద సంస్థలకు స్థావరం కల్పించడం..వారిని భారత్ పై ఉసిగొలపడం చూస్తూనే ఉన్నాం.  ఇటీవల పాక్ ప్రధాని సైతం తమ దేశంలో ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని ఒప్పుకున్నారు.  ఇటీవల పుల్వామా దాడికి ప్రతికార చర్యలు భారత సైనికులు తీర్చుకున్నారు.

భారత్ తో ఢీ కొనడం అంత సులువైన విషయం కాదని..భారత్ కి అన్ని దేశాల మద్దతు ఉందని పాక్ భావించి తోక ముడిచింది. ఇక ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత భారత్ పై మరోసారి విరుచుకుపడేందకు సన్నద్దం అవుతుంది పాకిస్థాన్.  ఇప్పటికే సాక్షాత్తు ఆ దేశ అధ్యక్షుడు మాట్లాడుతూ భారత్ ను ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా జీహాదీ ప్రకటించాలని విద్వేష పూరిత ప్రసంగాన్ని ఇచ్చారు.

కాశ్మీర్ ను ఎప్పటికైనా తన భూభాగంలో కలిపేసుకోవాలని పాకిస్తాన్ కలలు కనింది. దాంతో భారత్ సైనికులు అప్రమత్తం అవుతున్నారు. కచ్ సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించారు..ఇప్పటికే భారీ బలగాలను అక్కడకు తరలించారు.  ఉగ్రవాదులు చొరబడుతున్నారన్న ఇంటిటీజెన్స్ సమాచారం రావడంతో అలర్ట్ అయ్యారు. అక్కడ జల్లెడ పడుతున్న నావికాదలం, సరిహద్దు పోలీసులు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: