లోకేష్ పుట్టింది 23 ఏ... టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 23 ఏ

guyyala Navya
తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు ట్విట్టర్ పిట్టా ఇలా ఒకటి కాదు ఆయనకు చాలా బిరుదులు ఉన్నాయి. ఇన్ని బిరుదులు ఉన్నట్విట్  స్టార్ 'నారా లోకేష్'. ఇన్ని బిరుదులు ఉన్న ఆయన చేసే పనులను చూసి సోషల్ మీడియా వేధికగా నారా లోకేష్ పరువు మళ్ళి మళ్ళి తీస్తున్నారు నెటిజన్లు. 


ట్విట్టర్, వాట్సాప్, ఫేసుబుక్ ఇలా సోషల్ మీడియా వేధికగా కామెంట్లు చేస్తున్నారు. ఓడిపోయారు కదా అని ఊరికే కూర్చోవడం లేదు నారా లోకేష్.. పాలకపక్షం చేసే ప్రతి మంచి పనిని ఏదోకా రూపంలో విమర్శిస్తునే ఉన్నారు. వాటిని చూసి తట్టుకోలేని నెటిజన్లు అతనిపై కావాల్సినన్ని జోకులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక నెటిజన్ ఫేసుబుక్ వేధికగా స్పందించారు. 


2019 ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన మెజారిటీని, అతని పుట్టిన రోజు తేదిని పోలుస్తూ పోస్ట్ చేశారు. నెటిజన్ స్పందిస్తూ ''వామ్మో వామ్మో ! అన్నిటికి 23 ఏ వస్తుంది. ఏంటి ఈ 23 గోల అని ఎప్పుడు ఆలోచించేవాడిని. ఇంత పెద్ద విషయంలో మా చిన్నోడు 'నారా లోకేష్'కి పాత్ర లేకుండా ఎందుకు ఉంటుంది అని పుట్టిన తేదీ కోసం గూగుల్ లో వెతికా.. అంతే ఒక్కసారిగా షాక్ కి గురయ్యా.. పప్పు గారి పుట్టినరోజు ఆ రోజే. ఈ క్రెడిట్ అన్నా పప్పు నాయుడు గారిదే''.. అంటూ పోస్ట్ చేశాడు ఆ నెటిజన్. దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ ఫేసుబుక్, వాట్సాప్, ట్విట్టర్ లో వైరల్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: