'నారా లోకేష్'కి ఆ సమస్య ఉంది ...

guyyala Navya
వైసీపీ ఎంపీ, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ పై వ్యగ్యంస్త్రాలు సంధించారు. నారా లోకేష్, విజయసాయి రెడ్డి ఎప్పుడు ట్విట్టర్ లో ట్విట్ల యుద్ధం చేసుకుంటూనే ఉంటారు. ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి నారా లోకేష్ పై ట్విట్ చేశారు. 


విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ 'తామే సర్వజ్ఞానులమని, అన్యులంతా అజ్ఞానులని భావించేవారు Cognitive Bias (అభిజ్ఞా పక్షపాతం)తో ఉంటారని సైకాలజీ చెబుతోంది. దీనిని Dunning-Kruger effect అని పిలుస్తారు. లోకేశ్ సమస్య కూడా ఇదే. తండ్రి చాలా కాలం అధికారంలో ఉండటం. ఒక్కడే సంతానం కావడం వల్ల ఈ వ్యాధికి లోనై ఉండవచ్చు.' అంటూ ట్విట్ చేసారు. 


నారా లోకేష్ కి సమస్య ఉంది అని, అది కూడా తండ్రి వల్లే వచ్చిందని, ఒక్కడే సంతానం కావడం వల్ల ఈ సమస్య వచ్చిండచ్చు అని అయన ట్విట్ లో పేరుకొన్నారు. ఈ ట్విట్ పై నెటిజన్లు స్పందిస్తూ కామెడీ డైలాగ్ లు వేస్తున్నారు. ప్రస్తుతం నెటిజన్ల అంత 'నారా లోకేష్ సమస్యను ఎలా పరిష్కరించాలబ్బా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ ట్విట్ కి నారా లోకేష్ ఎలా స్పందిస్తారో చూడాలి.  



తామే సర్వజ్ఞానులమని, అన్యులంతా అజ్ఞానులని భావించేవారు Cognitive Bias (అభిజ్ఞా పక్షపాతం)తో ఉంటారని సైకాలజీ చెబుతోంది. దీనిని Dunning-Kruger effect అని పిలుస్తారు. లోకేశ్ సమస్య కూడా ఇదే. తండ్రి చాలా కాలం అధికారంలో ఉండటం. ఒక్కడే సంతానం కావడం వల్ల ఈ వ్యాధికి లోనై ఉండవచ్చు.

— Vijayasai Reddy V (@VSReddy_MP) July 22, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: