ఆంధ్రప్రదేశ్ ఎంపిల గోడదూకుడు వ్యవహారం బిజేపికి మేలు చేస్తుందా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో భారతీయ జనతా పార్టీ ప్రతిష్ట పెరిగిందా? తగ్గిందా? అనే ప్రశ్న పలువురి మదిలో కదలాడుతుంది. నిజం చెప్పాలంటే ఈ ప్రశ్నకు అర్ధంలేదు. ఇక్కడ అసలు బిజేపి ఉనికి నామ మాత్రం. అందులో దానికి తోడు ఎన్నికలకు ముందు ఇప్పటికే ఏపి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మిత్రపక్షాన్ని శతృపక్షం చేసి బిజేపికి చేసిన డామేజ్ అంతా ఇంతా కాదు. ఇక బీజేపి ప్రతిష్ట దిగజారిందని చెప్పనవసరం లేదు.  


మామూలు పరిస్థితుల్లో అయితే నిస్సందేహంగా బీజ్జేపి ప్రతిష్ట తగ్గిందనే చెప్పవచ్చు. ఇప్పుడు బిజేపి ఏపిలో తన రాజకీయ ప్రభవాన్ని స్వయంగా ప్రతిష్టించుకోవాలని అనుకుంటుంది. ఎన్నికలలో ఒక్క సీటు గెలవకపోయినా తన శతృవైన చంద్ర బాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేసి వారి శాసన సభ్యులను, పార్లమెంట్ సభ్యులను కబ్జా చేసే ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఇదే పనిని గతంలో టిడిపి చేసి అధికారం వెలగబెట్టింది. నిజం చెప్పాలంటే ఇప్పుడు టిడిపి దారి తెన్ను లేని ఉలిపిరి కట్టె. దాన్ని ఎవరైనా రాజకీయంగా రాగ్ లేదా రేప్ చేయవచ్చు.



అందుకే  టిడిపి ఫిరాయింపు నేతలను చూసుకుని భారతీయ జనతా పార్టీ నేతలు జబ్బలు చరుచుకుంటున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన వారు మాత్రమే కాకుండా ఇంకా వస్తారని వారు గర్వంగా చెప్పుకుంటూ ఉన్నారు. అయితే వచ్చే వాళ్లు అంతా తమ తమ వ్యక్తిగత స్వార్థాలను చూసుకుని - కేసుల భయాలతో వస్తున్నారు తప్ప మరోటి కాదని సామాన్య ప్రజలకు కూడా తెలిసి పోతోంది. అందులో ఇప్పటి వరకూ వెళ్లిన నలుగురిలో ఎవరికీ ప్రజాబలం లేదు. అంతా నామినేటెడ్ పదవులు పొందిన వారు. కనీసం ప్రజల నుంచి ఎంపీలుగా ఎన్నికైన వారు అయితే చెప్పు కోవడాని కి మాత్రం గొప్పగా ఉంటుంది. 


రాజ్యసభ ఎంపీలు మారినంత మాత్రన ప్రజాబలం పెరిగిందని చెప్పడానికిలేదు. ఇదివరకూ అలాంటి రాజకీయాలు చాలానే జరిగాయి. ఇప్పుడు ఫిరాయించింది రాజ్యసభ సభ్యులు మాత్రమే. ఇలాంటి నేపథ్యంలో వారి బలం బీజేపీకి ఎంత వరకూ ఉపయోగ పడుతుంది అనేది అర్థం చేసుకోవచ్చు. వీరి చేరిక బీజేపికి మేలు చేయక పోవచ్చు కాని రాజ్యసభ నంబర్-గేం కు ఊతం ఇస్తుంది.



చంద్రబాబు నాయుడు ఇలాంటి వారిని రక్షించటం కోసమే రాష్ట్రంలో కేంద్ర విచారణ సంస్థలు సీబీఐ ఈడి ఐటిల ప్రవేశాన్ని నిషేదించింది. అందుకే ఈ అక్రమ సంగమం వెనుక చంద్రబాబు కోవర్ట్ వ్యూహం ఉండి ఉండవచ్చు. ఏదేమైనా వారికి ఇది వ్యక్తిగతంగా ఏమాత్రం ప్రయోజనం ఇవ్వదు సరికదా చంద్రబాబుకు ఇది కూడా రాజకీయంగా బలమైన దెబ్బే అని అంటు న్నారు రాజకీయ విశ్లేషకులు.     


ఇలాంటి నేపథ్యంలో రాజ్యసభ సభ్యుల చేరిక భారతీయ జనతా పార్టీకి ప్రజల్లో బలాన్ని పెంచే అంశం కాకపోగా - ఫిరాయింపు రాజకీయాలతో నెగిటివ్ ఇమేజ్ ను పెంచు కుంటోంది కమలం పార్టీ అని విమర్శకుల భావన. అయితే ఆ పార్టీకి రాజ్యసభలో బలం పెరిగింది. రాజ్యసభలో ఇప్పటి వరకూ బీజేపీకి బిల్లులు పాస్ చేసుకోవటానికి కూడా తగినంత బలం లేదు.


ఇలాంటి నేపథ్యంలో ఈ ఫిరాయింపు దారులకు కమలం పార్టీ చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంది. ప్రజాబలం పరంగా బీజేపీకి ఇది పెద్దగా ప్రయోజనం లేని పరిణామం. కేవలం రాజ్యసభలో బలోపేతం కావడానికి మాత్రం ఉపయోగపడుతూ ఉంది. అయితే ఏపీ ప్రజల్లో మాత్రం బీజేపీపై ఇది నెగిటివ్ ఇమేజ్ కు కారణం అయినా దానికి ఏ ప్రభావమూ ఉండదు. అన్నింటిని మించి బిజేపి- టిడిపి పతనాన్ని కళ్ళజూడటం అనేది వారికి ఆత్మ సంతృప్తి ఇస్తుంది. ఏపిలో బీజేపి స్వయం ప్రకాశానికి చాప కింద నీరులాగా ఏపిలో తమ రాజకీయ భవితకు బాటలు వేయవబోతుందనేది కొందరు విశ్లేషకుల వాదన.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: