సొమ్మొకడిది సోకొకడిది - కష్టం హరీష్ ది - సోకు తెలంగాణా బంగరు కుటుంబానిది - ఇదీ కాళేశ్వరం కథ

హరీష్ రావు - కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పేరు తలిస్తే మరొకటి గుర్తుకు వస్తాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అనగానే టక్కున గుర్తొచ్చేది మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన నుండి పనుల్లో వేగం పెంచటం, అనుమతులు సాధించటం ఇలా అణువణువూ ఆయన పడ్డకష్టం సుతరామూ మామూలు కాదు. హరీష్ రావు విధానం పరిశీలించిన పాత తరం వారికి ఆయనలో ఆనాటి ఏపి ముఖ్యమంత్రి జలగం వెంగళ రావు లోని కార్యదీక్ష కార్య కుశలత దిట్టంగా కనిపిస్తుంది. 


హరీష్ రావుకు నిలుచున్నా కూర్చున్నా అర్ధరాత్రి అపరాత్రి మెలకువ వచ్చినా కలలోనైనా, ఇలలోనైనా సరే అప్పటి కప్పుడు సిద్ధమై అక్కడికి వెళ్లేవారు. పనులను దగ్గర  నుండి పరిశీలన పర్యవేక్షణ చేసేవారు  అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ, పనుల్లో జాప్యం జరిగితే దాని కారణాలు తెలుసుకొని సహకరిస్తూ అవసరమైన చోట కాస్తగట్టిగానే హెచ్చరిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతంచేశారు. వివిధ ప్రభుత్వ శాఖల మద్య సమన్వయం సాధిస్తూ కనుచూపుమేర పనులకు ఆటంకాలు లేకుండా చూసుకునేవారు. ఆ పవిత్ర కార్యక్రమాన్ని నేటికి  పూర్తిచేయగలిగారంటే కూడా  ప్రోజెక్ట్ పునాదుల్లోపడ్డ  హరీష్ రావు పట్టుదల కార్యదీక్షేకారణం.  



అయితే, ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో నేరుగా ఆయన పాల్గొనకపోయినా, సిద్దిపేటలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. అయితే, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో హరీష్ రావును అక్కడికి పిలవక పోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. "కేసీఆర్ కార్యసాధకుడే కావచ్చు, కాని కార్యనిర్వాహకుడు మాత్రం హరీష్ రావు మాత్రమే!’ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోష్టులతో హోరెత్తిస్తున్నారు.



ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇలా పలు సోషల్ మీడియాల వేదికగా హరీష్ రావును వేనోళ్ల పొగిడేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విజువల్స్‌ను జోడిస్తూ అందులో హరీష్ రావు ఫోటోలు చేర్చుతూ వీడియోలు తయారు చేస్తూ బహు ముఖాలుగా పోస్ట్ చేస్తు న్నారు. ఇదిలా ఉండగా, సిద్దిపేట వేడుకల్లో పాల్గొన్న హరీష్ రావు, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించడంపై సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉంటే 30ఏళ్లు గడిచినా ఆ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేది కాదని, కానీ కేసీఆర్ నాయ కత్వం లో 3ఏళ్లలోనే పూర్తయిందన్నారు.





ప్రాజెక్టులకోసం ఇంజనీర్లు, అధికారులు, కార్మికులు ఎంతోమంది కష్టపడ్డారని, కొంతమంది రైతులు భూములు కోల్పోయారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. దసరా పండగ నాటికి సాగునీరు అందించే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పనుల్లో తనవంతు సహాయం చేసినందుకు సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: