పిల్లలను సరైన దిశలో నడిపించేది తల్లి. : వైఎస్ జగన్

Edari Rama Krishna
ఈ లోకంలో ఎన్నో పదాలకు నిర్వచనాలు ఉన్నాయి..అర్థాలు ఉన్నాయి..కానీ ఒక్క తల్లి అనే పదానికి నిర్వచనం ఉండదు..ఇవ్వలేరు.  ఎందుకంటే ఆ పదం అనిర్వచనమైనది..ఎన్నో అర్థాల సమ్మిళతమైనది..మాతృత్వం.  అమ్మ అంటే కమ్మనైన పదం..తాను నవమోసాలు మోసి చావుకు దగ్గరికి వెళ్లి తన బిడ్డకు జన్మనిస్తుంది. 


నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ఎంతో మంది సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  ఈరోజు అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా వైసీపీ అధినేత జగన్ తల్లులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 


‘తమ పిల్లలను సరైన దిశలో నడిపిస్తూ, వారి బాగోగుల గురించి ఆలోచిస్తూ, పిల్లలకు సరైన మార్గదర్శకత్వం చేస్తూ అండగా నిలిచే ప్రతీ తల్లికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు’ అని జగన్ ట్వీట్ చేశారు.
To each and every mother who nurtures, worries about, guides and supports their children every single day, wishing you a very happy Mothers Day.

— YS Jagan Mohan Reddy (@ysjagan) May 12, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: