“ఒక్క చాన్స్ ఇచ్చి చూద్ధాం!” అనే జనం - అదే జగన్ గెలుపు!

విశేషం ఏమిటంటే ఈ అంశాన్ని తెలుగుదేశం శ్రేణులు కూడా కొంత వరకూ ఒప్పుకుంటున్నాయి. 'జగన్ కూ ఒక ఛాన్స్ ఇద్దాం' అనే అభిప్రాయం జనాల్లో ఉందని వారు కూడా అంటుండటం విశేషం. ఒకవైపు తామే గెలుస్తామని తెలుగుదేశం అధినేత ధీమా చెబుతూ ఉన్నారు. అయితే ఆ పార్టీ నేతలు - కార్యకర్తలు మాత్రం క్షేత్ర స్థాయిలో 'జగన్ కూ ఒక ఛాన్స్' అనేది మంత్రంగా పని చేసిందని ఒప్పుకుంటున్నారు!


జగన్ ఐదేళ్ల నుంచి కాదు-అంతకు ముందు నాలుగేళ్లనుంచి కూడా జనం మధ్యనే ఉన్నారు. తొమ్మిదేళ్లు గా జగన్ దాదాపుగా ప్రతిపక్షంగా ఉంటూ వచ్చారు. ఏదో ఒక యాత్ర చేపట్టడం - వివిధ ప్రజా పోరాటాలు - వివిధ అంశాల గురించి స్పందించడం. ఇలా నిత్యం జనం మధ్యనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ బలమైన ముద్ర జన హృదయాల మీద పడిందని-వైఎస్ కుమారుడిగా-ఒక రాజకీయ ప్రత్యామ్నాయంగా జగన్ గత ఎన్నికల్లో కొంత వరకూ విజయవంతం అయ్యారు. ఇక ముఖ్యమంత్రిగా కావడం విషయంలో జగన్ ఈ సారి విజయవంతం అయ్యుండే అవకాశాలే ఎక్కువని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.


రాజకీయంలో ఎన్నికల ఫలితాలను చాలా విషయాలు ప్రభావితం చేస్తాయని, అన్నింటికి మించి ప్రభావితంచేసే అంశం ప్రజాభిప్రాయం. అదొక వేవ్ లా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. అలాంటి వేవ్ జగన్ కు అనుకూలంగా ఉండవచ్చని.. 'జగన్ కూ ఒక ఛాన్స్ ఇద్దాం! తండ్రి పాలన బాగుండేది అలాంటి పాలన ఆయన కూడా ఇస్తాడేమో చూద్దాం!' అనే టాక్ ప్రజల మధ్యన పోలింగ్ వరకూ నడిచిందని, అదే ఈ ఎన్నికల తీర్పును గట్టిగా ప్రభావితంచేసి ఉండే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక అసలు కథ ఏమిటో, మే ఇరవై మూడున తెలుస్తుంది!

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: