కుమారస్వామి! నువ్వు 100 సార్లు స్నానం చేసినా గేదె లాగే కనిపిస్తావు: గతి తప్పుతున్న విమర్శలు

ఎన్నికల వేళ నాయకుల ప్రచారం శృతి తప్పుతుంది. రాజకీయం మరచి వ్యక్తిగత స్థాయికి దిగి ఒకరినొకరు ఎలా విమర్శించు కుంతున్నారో? వినాలంటే అసహ్యంగా ఉంది. చివరికి ప్రధానమంత్రిని సైతం అసహ్యంగా కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ సభ్యత సంస్కారాలు అనుభవాలు ఏవీ పరిగణనలోకి రావట్లేదు. అధికార సాధనే పరమావధి.

కాలం కలసివచ్చి ముఖ్యమంత్రి అయినవాళ్ళు” కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి గౌడ సైతం ఒకడుగు వెనక్కి వేయటానికి అంగీకరించట్లేదు. 
ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకమైన మేకప్‌ తో కెమెరా ముందుకు వస్తారని కర్ణాటక సీఎం కుమారస్వామి ఇటీవల విమర్శించిన సంగతి తెలిసిందే. ఆ మేకప్ కారణంగానే ఆయన ముఖం తళుక్కున మెరుస్తుంటుందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో కుమారస్వామి వ్యాఖ్యలపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజు కగే ఘాటుగా స్పందించారు. 

"కుమారస్వామి రోజుకు 100 సార్లు స్నానం చేసినా, కర్రి గేదె లాగే కనిపిస్తారని హేళన చేశారు. నరేంద్ర మోదీ రోజుకు 10 సార్లు పౌడర్ రాసుకుంటారని, 10 డ్రెస్సులు మారుస్తారని కుమారస్వామి విమర్శిస్తున్నారు. నిజానికి మోదీ తెల్లగా, అందంగా ఉంటారు. ఆయనకు మేకప్‌ తో పనిలేదు. కానీ నువ్వు మాత్రం రోజుకు 100 సార్లు స్నానం చేసినా బర్రె లాగే కనిపిస్తావు" 


బహిరంగ సభలు, మీడియా సమావేశాలకు వచ్చే ముందు నరేంద్ర మోదీ వాక్సింగ్‌,  మేకప్ తదితరాలు పూర్తిగా చేసుకుని వస్తారని కుమారస్వామి కొద్ది రోజుల క్రితం విమర్శించారు. అందుకే ఆయన ముఖం మెరుస్తూ ఉంటుందన్నారు. 

అదే మన విషయం (ఇతర నాయకులను కలుపుకొని) తీసుకుంటే ఈరోజు స్నానం చేసి బయటకెళ్లా మంటే, మళ్లీ మరుసటి రోజే స్నానం చేసి ముఖం కడుక్కుంటాం! అన్నారు. అందుకే మన ముఖాలు అంత బాగా కనిపించవని కాబట్టే మీడియా నరేంద్ర మోదీని తప్ప మనల్ని చూపించడం లేదని విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: