ఐదు ఓట్లంటే..ఎల్ఈడీ టివి..పది ఓట్లంటే ఫ్రిజ్ : మంగళగిరిలో ఏం జరుగుతుంది?

ఆంధ్రప్రదేశ్ లో రేపు ఎన్నికలు..ఇంత దెబ్బా-దెబ్బగా ఉండే ఎన్నికలను ఇంతకు ముందెన్నడూ చూడలేదంటున్నారు ఆంధ్రప్రజ. ఆంధప్రదేశ్ లో జరిగే 174 సీట్లలో పోలింగ్ ఒక ఎత్తయితే..మంగళగిరి ఒక్క సీట్ ఒక ఎత్తన్నట్లుగా ఉంది పరిస్థితి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


భావి తెలుగు దేశం పార్టీ అధినేత, తెదేపా గెలిస్తే కాబోయే ముఖ్యమంత్రిగా చెప్పబడుతున్న యువరాజు నారా లోకేష్ నాయుడు గారు తన రాజకీయ జీవితం లోనే ప్రపధమంగా ప్రజా తీర్పు కోరుతూప్రజాస్వౌమ్య ఆరంగెట్రం చేస్తున్న స్థానం ఇది.


ఆళ్ల రామకృష్ణారెడ్డి సామాన్య రైతు..స్థానికుడు, అసమాన్యంగా మారి రాష్ట్ర ప్రభుత్వ ఆగడాలను కోర్టుకు లాగి కోర్టు నుండి ప్రజలకు మంచి చేసేలా ప్రయత్నిం చిన సిట్టింగ్ ఎమ్మెల్యే.


నారా లోకేష్ నాయుడు మంగళగిరిలో నామినేషన్ కు ముందు కాలుకూడా పెట్టలేదంటారు, అటువంటి పరిస్థితులలో ఇప్పుడిప్పుడే వస్తున్న వార్తలను బట్టి చూస్తే..మంగళగిరిలో డబ్బే-డబ్బట.. 5 ఓట్లంటే ఎల్ఈడీ టివి, మించి ఉంటే ఫ్రిజ్, ఇంకా ఎక్కువుంటే ఏదయినా అన్నట్లుందట పరిస్థితి..మరి నిజమెంతో నిఠాలాక్షుడికెరుక.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: