బాబు స్నేహితుడు ఫరూఖ్ అబ్దుల్లా ఆర్టికల్ 370 తొలగిస్తే భారత్‌ తో విడిపోవటమే! అంటూ సంచలనం

కాశ్మీర్ పై పాకిస్తాన్ కు అధిక ప్రయోజనాలు కలిగిస్తూ భారత్ ను ఆర్ధికంగా భారం కలిగిస్తూ పీల్చి పిప్పిచెసే చట్టం ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 (ఏ) తొలగించి భారత రాష్ట్రాలతో సమానం చెసే ప్రభుత్వ ప్రయత్నాన్ని వ్యతిరేఖిస్తూ జమ్ము కశ్మిర్ మాజీ ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రాణ స్నేహితుడు ఫరూక్ అబ్దుల్లా మరో దేశ విభజనకు దారి తీసే వ్యాఖ్యలు ప్రవచించారు. 
   
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 (ఏ) తొలగిస్తే ప్రజలు స్వాతంత్రం వైపు అడుగులు వేస్తారని 'నేషనల్ కాన్ఫరెన్స్' అధినేత ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. బీజేపీ ప్రజల మనస్సులు కలిసేందుకు చర్యలు తీసుకోవాలే, తప్ప విడగొట్టే ప్రయత్నాలు చేయకూడదని ఆయన హితవు పలికారు. ఆర్టికల్ 370 ని తొలగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా హెచ్చరించారు. 

అధికార బీజేపీ పార్టీ విడుల చేసిన మేనిఫెస్టో లో ప్రధానంగా ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 (ఏ)లను వెనక్కు తీసుకుంటామని హామీ యిచ్చింది. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 తొలగిస్తే ప్రజలు స్వాతంత్రం వైపు అడుగులు వేస్తారని అన్నారు. బీజేపీ ప్రజల మనస్సులను కలిపేటందుకు తగిన చర్యలు తీసుకోవాలని తప్ప మనసులు విరిచేందుకు ప్రయత్నాలు చేయకూడదని ఫరూఖ్ అన్నారు. అలాగే ఆర్టికల్ 35 (ఏ) తొలగింపును కూడా ఫరూఖ్ తప్పుపట్టారు. రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల రీత్యా రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్‌ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ, ఆర్టికల్ 370 తొలగిస్తే, దాని పరిణామాలు అర్థం చేసుకోలేరని అన్నారు. అంతే కాదు దైవసాక్షి గా చెబుతున్నానని, ఒక వేళ దైవం నిర్ణయం కూడా ఇదే అయితే, మనందరికీ స్వేచ్ఛ లభించ వచ్చని అన్నారు. అంతే కాదు ఆర్టికల్ 370 తొలగిస్తే జాతీయ జెండా ఎగరేసే వారు సైతం మిగలరని హెచ్చరించారు. 

ఆర్టికల్ 35 (ఏ) తొలగింపుపై స్పందిస్తూ, ఈ చట్టం ద్వారా స్థానికులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో స్థానం కల్పిస్తుందని అన్నారు. అంతే కాదు ఆర్టికల్ 35 (ఏ)ను 1927 లోనే కాశ్మీర్ మహారాజు హరిసింగ్ స్థానిక గిరిజన తెగలకు సంబంధించిన డోగ్రాలు కాశ్మీర్ లోయను విడిచి తరలి వెళ్లిపోకుండా, వారి జనాభాను కాపాడేందుకు తీసుకున్న నిర్ణయ మని అన్నారు. అయితే వారిని తరిమి కొట్టి ఇతరులతో కాశ్మీర్ లోయను నింపుతారా? అని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: