ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ఇస్తున్న హనుమాన్ డైరెక్టర్..!!

murali krishna
క్రియేటివ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ ఏడాది 'హనుమాన్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎవరూ ఊహించని ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.కేవలం రూ.45 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దాదాపు రూ.300 కోట్లు కొల్లగొట్టి అబ్బురపరచింది.ఈ మూవీని దర్శకుడు ప్రశాంత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. విఎఫ్ఎక్స్ వర్క్ ఈ మూవీకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దీనికి సీక్వెల్‌ను దర్శకుడు ప్రకటించాడు. ఈ సీక్వెల్‌ మూవీని 'జై హనుమాన్' పేరుతో రూపొందిస్తున్నట్లు తెలిపాడు. ఇక ఈ సీక్వెల్ ప్రకటించినప్పటి నుంచి అంచనాలు పెరిగిపోయాయి. 'జై హనుమాన్‌తో ప్రేక్షకులకు గ్లోబల్ ఎక్స్ పీరియన్స్ అందించబోతున్నాడు.ఈ సినిమా పోస్టర్‌ని రామ నవమి రోజున విడుదల చేసి అభిమానులను ఉర్రూతలూగించాడు. ప్రీక్వెల్ అన్ని భాషల్లో సంచలన విజయం సాధించడంతో, అతని నెక్స్ట్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి,
ఈ నేరకు ప్రశాంత్ వర్మ తన తదుపరి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశాడు. జై హనుమాన్ కోసం బిగ్ స్టార్‌తో కలిసి పని చేయనున్నాడు. తెలుగు సినిమా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రతిభావంతులందరినీ తన యూనివర్స్ లో చేరాల్సిందిగా ఆహ్వానించాడు. యువకులు, ఔత్సాహిక సాంకేతిక నిపుణులు తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఇదొక పెద్ద అవకాశం. దర్శకుడు ఒక నోట్ రాశాడు. "కాలింగ్ ఆల్ ఆర్టిస్ట్, సూపర్ పవర్స్ మాట్లాడుకుందాం! మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టే మీ ప్రత్యేక నైపుణ్యం ఏమిటి? కథలు రూపొందించే నేర్పు, ఎడిటింగ్, మంత్రముగ్ధులను చేసే నైపుణ్యం కలిగిన గ్రాఫిక్స్, మార్కెటింగ్.. మీ కళాత్మక నైపుణ్యాలతో యూనివర్స్ లోకి ప్రవేశించాలనుకుంటున్నారా? అంటూ తన మెయిల్ ఐడీని ఇచ్చాడు.
జై హనుమాన్ సినిమాకు సంబంధించి ఇప్పటికే చాలా పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. ఆ పుకార్లన్నీ నిజమేనంటూ ఈమధ్య ప్రకటించాడు ప్రశాంత్ వర్మ.కళాకారులందరినీ పిలుస్తూ, సూపర్ పవర్స్ గురించి మాట్లాడుకుందాం! మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టే మీ ప్రత్యేక నైపుణ్యం ఏమిటి? ఇది స్పిన్నింగ్ టేల్స్, ఎడిటింగ్, గ్రాఫిక్స్‌తో మంత్రముగ్ధులను చేసే నైపుణ్యం ఉందా.. లేదా గొప్పగా మార్కెటింగ్ చేయగలరా.. మీ అవగాహన నైపుణ్యాలతో ప్రపంచంలోకి అడుగు పెట్టాలని ఉందా?. మీకున్న గొప్ప కళాత్మక నైపుణ్యాలేంటో చెప్పండి. మనం కలిసి కొత్త వరల్డ్ క్రియేట్ చేద్దాం. మీ పోర్ట్‌ఫోలియోలను 'talent@thepvcu.com' ద్వారా తెలియజేయండి'' అంటూ ఓ సోషల్ మీడియాలో తెలియజేశాడు. ఈ మేరకు ఓ పోస్టర్ వదిలాడు.దీని బట్టి యాక్టింగ్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, గాఫిక్స్ ఇలా ఏ రంగంలోనైనా టాలెంట్ ఉంటే అలాంటి వారు వారి డీటెయిల్స్‌ని తాను చెప్పిన మెయిల్‌కు పంపించాలని కోరాడు. దాని ద్వారా పీవీసీయూలో అవకాశం పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: