ఏపీ: రాయచోటిని ఏలే రాజేవరు..?

Pandrala Sravanthi
• వైయస్సార్ సెంటిమెంట్ కలిసి వస్తుందా..
•ముస్లిం ఓట్లు వారి వైపేనా..?
• ప్రభుత్వ వ్యతిరేకతను టిడిపి వాడుకుంటుందా..?
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  రాయచోటి నియోజకవర్గం కూడా చాలా కీలకంగా ఉంటుంది. ఈ నియోజకవర్గం వైసీపీకి కంచుకోటగా మారింది. అలాంటి ఈ నియోజకవర్గంలో  ఈసారి చాలా అద్భుతమైన పోరు జరగబోతోంది.ఈ పొరలో పై చేయి సాధించేది ఎవరు. ముస్లిం ప్రజలు ఎవరికి పట్టం కడతారు.  అనే వివరాలు చూద్దాం..
 రాయచోటిలో వైసిపికి సంబంధించి  గడికోట శ్రీకాంత్ రెడ్డిని  బరిలో దింపింది. అలాగే టిడిపి కూటమి తరఫున రాంప్రసాద్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక srikanth REDDY' target='_blank' title='గడికోట శ్రీకాంత్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">గడికోట శ్రీకాంత్ రెడ్డి విషయానికి వస్తే..ఈయన రెడ్డి సామాజిక వర్గం నేత, రాజకీయ నేపథ్యం ఉంది. మొదటిసారి 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2012లో వైసీపీలో చేరి ఉప ఎన్నికల్లో గెలిచారు. 2014, 2019లో కూడా గెలిచారు. ఇక రాంప్రసాద్ రెడ్డి విషయానికి వస్తే. ఈయన కూడా రెడ్డి సామాజిక వర్గం నేత.ఈయన తండ్రి మడిపల్లి నాగిరెడ్డి  రెండుసార్లు రాయచోటి ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో ఈయన రామ్ సమైక్యాంధ్ర పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయి , ఆ తర్వాత తన సోదరి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడారు. రాయచోటి రాజంపేట లోక్ సభ స్థానంలో ఉంటుంది. ఇక్కడ ముస్లిం ఓట్లే కీలకం. ముస్లిం ఓట్లు 86వేలు, బీసీలకు 51వేలు, రెడ్డిలకు 30వేలు, ఎస్సీ, ఎస్టీలు 91వేల ఓట్లు ఉన్నాయి.
 గడికోట శ్రీకాంత్ రెడ్డి :
 బలాలు:
 రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం.
 నవరత్నాలు పథకాలు.
 రమేష్ రెడ్డి వైసీపీలో చేరడం.
 వైయస్సార్ చేసిన అభివృద్ధి.
 జగన్ క్లాస్మేట్.
 బలహీనతలు:
 మైనార్టీ వర్గాలకు మొండి చేయి.
 అభివృద్ధి జరగకపోవడం.
 ప్రభుత్వ వ్యతిరేకత.

రాంప్రసాద్ రెడ్డి
బలాలు:
 శ్రీకాంత్ రెడ్డి పై వ్యతిరేకత
 రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం.
 ఇదివరకు ఓడిపోయిన సింపతి.
 శ్రీకాంత్ రెడ్డి భూకబ్జాలు.
 ముస్లిం ఓట్లు.
 బలహీనతలు :
 టిడిపి అంతర్గత విభేదాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: