భారత్ వైపు దూసుకు వచ్చిన పాక్ యుద్ధ విమానాలు...తరిమికొట్టిన భారత్

భారత్ పాక్ ల మద్య సరిహద్దుల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొనే ఉంది. అవకాశం దొరికితే పగ ప్రతీకారం తీర్చుకునే పనిలో నిమగ్నమై ఉంది పాకిస్తాన్. ఇదే సందర్భంలో తాజాగా పాక్‌కు చెందిన నాలుగు ఎఫ్‌‌-16 యుద్ధ విమానాలు, ఒక డ్రోను, భారత భూభాగానికి సమీపంలోకి రాగా, భారత వాయు సేన అప్రమత్తమై ఎదురుదాడికి దిగటంతో పాక్ యుద్ధ విమానాలు తోక ముడిచేశాయి. 

పాక్ సైన్యం సరిహద్దు వెంట ఎప్పటిలాగానే కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. పాక్‌కు చెందిన నాలుగు ఎఫ్‌‌-16 యుద్ధ విమానాలు, ఒక డ్రోను, భారత భూభాగ  సమీపం లోకి నిన్న (సోమవారం-ఏప్రిల్ 1) తెల్లవారుజామున 3 గంటలకు సరిహద్దుకు సమీపంలో పంజాబ్‌లోని ఖేమ్‌కరణ్ సరిహద్దు ప్రాంత గగనతలంలో ఇవి చక్కర్లు కొట్టినట్లు భారత రాడార్లు గుర్తించాయి. వాటిని గుర్తించిన భారత సైన్యం వెంటనే సుఖోయ్‌ ఎస్‌యూ-ఎంకేఐ, మిరాజ్‌ యుద్ధవిమానాలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. పాక్ యుద్ధ విమానాలపైకి ఎదురుదాడితో ప్రతిస్పందించింది. దీంతో పాక్ యుద్ధ విమానాలు తోకముడిచి తిరిగి తమ భూభాగం వైపునకు తిరిగి వెళ్లిపోయాయి. బాలాకోట్ దాడులు జరిగిన నెల రోజుల తర్వాత మరోసారి ఈ ఘటన చోటుచేసుకుంది. 

పుల్వామా ఉగ్రదాడిలో 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన ఘటనకు ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్, పాక్‌ భూభాగంలోకి ప్రవేశించి ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. నాటి నుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఐఏఎఫ్ దాడులకు ప్రతీకారంగా పాక్‌ తమ యుద్ధవిమానాలతో భారత గగనతలం లోకి దూసుకొచ్చే ప్రయత్నాలు చేసింది. కశ్మీర్‌లోని పూంచ్‌ సరిహద్దుకి 10కి.మీ. దూరంలో పాక్‌ యుద్ధ విమానాలను గుర్తించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెంటనే పాక్‌ చర్యలను తిప్పికొట్టింది. ఈ క్రమంలో భారత వింగ్ కమాండర్ అభినందన్.. పాక్ సైన్యానికి చిక్కడం తీవ్ర ఉత్కంఠకు దారి తీసిన సంగతి అందరికి తెలిసిన విషయమే. విదితమే. 
ANI‏Verified account @ANI
Sources: At 3 AM today, Indian radars detected a large data-sized UAV & package of 4 Pakistani F-16s flying close to Indian data-border in Khemkaran sector in Punjab. India scrambled Su-30MKIs & Mirage jets in response after which the Pakistani jets retreated further into their territory.

6:27 AM - 1 Apr 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: