డ్రగ్స్ హేమను సపోర్ట్‌ చేస్తావా.. మంచు విష్ణుపై ట్రోలింగ్‌లు?

Chakravarthi Kalyan
బెంగళూరులో రేవ్ పార్టీలో జరిగిన డ్రగ్స్ కేసులో సినీనటి హేమపై జరుగుతున్న ప్రచారాన్ని ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఖండించారు. సామాజిక మాధ్యమాలు, కొన్ని మీడియా సంస్థలు, వ్యక్తులు హేమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మంచు విష్ణు మండిపడ్డారు. ఒక తల్లిగా భార్య ఉన్న ఆమెపై పుకార్ల ఆధారంగా వ్యక్తిగతంగా దూషించడం తగదని మంచు విష్ణుహితవు పలికారు. నిర్ధారణ లేని, ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయడం మానుకోవాలన్న మంచు విష్ణు... హేమ దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగా పరిగణించాలన్నారు.
అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చట్ట విరుద్దమైన కార్యకలాపాలను ఖండిస్తుందన్న విష్ణు... హేమకు సంబంధించిన ఖచ్చిమైన ఆధారాలను పోలీసులు తమకు అందజేస్తే మా అసోసియేషన్ తగిన చర్యలు తీసుకుంటుందని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అప్పటి వరకు హేమపై నిరాధారమైన ఆరోపణలను సంచలనాల కోసం ప్రసారం చేయవద్దని విష్ణు విజ్ఞప్తి చేశారు. అయితే నెటిజన్లు మంచు విష్ణును కూడా ట్రోల్‌ చేస్తున్నారు. హేమ డ్రగ్స్ పార్టీలో దొరికిపోయినట్టు సాక్షాత్తూ బెంగళూరు పోలీసులే చెబుతుంటే.. ఇంకా ఎలా వెనకేసుకొస్తారని మంచు విష్ణును ట్రోల్‌ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: