ఎడిటోరియల్ : మంగళగిరిలో జెండా ఎగరేస్తాడట..డబ్బు, అధికారమేనా ధైర్యం ?

Vijaya

రాబోయే ఎన్నికల్లో పేరు ఖరారైన తర్వాత మొదటిసారిగా చినబాబు లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి జెండాను ఎగరేయటం ఖాయంగా చెబుతున్నారు. ఇక్కడ పోటీ చేసే ఉద్దేశ్యంతో మూడేళ్ళ క్రితమే మంగళగిరిలో ఓటు రాయించుకున్నట్లు ఇపుడు చెబుతున్నారు. 1989 తర్వాత ఈ నియోజకవర్గంలో ఎగరని టిడిపి జెండా రాబోయే ఎన్నికల్లో తన వల్లే ఎగురుతుందని చాలా గట్టిగానే చెబుతున్నారు. మరి చినబాబు ధైర్యమేంటో ఎవరికీ అర్ధం కావటం లేదు.

 

నిజానికి టిడిపి ఏర్పాటైన తర్వాత 1983, 85లో మాత్రమే పోటీ చేసింది. తర్వాత నుండి కమ్యూనిస్టులతో పొత్తుల కారణంగా పోయిన ఎన్నికల్లో బిజెపితో పొత్తు వల్ల టిడిపి పోటీ చేయలేదు. అంటే 30 ఏళ్ళ తర్వాతే మళ్ళీ టిడిపి పోటీలోకి దిగుతోంది. ఒక నియోజకవర్గంలో 30 ఏళ్ళపాటు పార్టీ ఏ ఎన్నికలోను పోటీ చేయలేదంటే పార్టీ యంత్రాంగం చాలా వీకైపోతుంది. మంగళగిరిలో కూడా జరిగిందదే.

 

ఈ నియోజకవర్గంలో బిసిలు ఎక్కువ. ప్రధానంగా చేనేతలకు పట్టుక్కువ. ఎస్సీలు సుమారు 50 వేలమందున్నారు. చేనేతలు 40 వేలదాకా ఉంటారు. కమ్మ, రెడ్డి, యాదవ తదితర సామాజికవర్గాలు కూడా పర్వాలేదు. ఇటువంటి నియోజకవర్గంలో పోయిన ఎన్నికల్లో వైసిపి తరపున ఆళ్ళ రామకృష్ణారెడ్డి గెలిచారు. అప్పట్లో గెలిచింది కేవలం 13 ఓట్ల మెజారిటీతోనే అయినా ఆ తర్వాత అపారమైన పట్టు సంపాదించారు.

 

ఆళ్ళకు విపరీతమైన పట్టొచ్చిందంటే థ్యాక్స్ టు చంద్రబాబు. పైగా రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో చేనేతలకే టికెట్ ఇస్తానని చంద్రబాబు చాలా సార్లే చెప్పారు. తీరా టికెట్లు ఖరారు చేసేటప్పటికి కొడుకునే దింపారు. దాంతో చేనేతలు, బిసిలు మండిపోతున్నారు. లోకేష్ కు ఎట్టి పరిస్ధితుల్లోను సహకరించేది లేదని చేనేతలు గట్టిగా చెబుతున్నారు. మరోవైపు టిడిపి ప్రభుత్వంపై అన్నీవర్గాల్లో మండిపోతున్న జనాలు.

 

లోకేష్ క్యాండిడేట్ అయిన తర్వాత ఈ నియోజకవర్గానికి చెందిన పలువురు టిడిపి నేతలు వైసిపిలోకి మారిపోయేందుకు రెడీ అవుతున్నారట. చినబాబు దెబ్బేంటో ఇప్పటికే రుచిచూసిన చాలామంది నేతలు టిడిపిలో ఉండటం అనవసరమనే నిర్ణయానికి వస్తున్నారట. వాస్తవాలు ఇలావుంగే లోకేష్ ఏమో జెండా ఎగరేస్తానని శపథాలు చేస్తున్నారు. చినబాబుకు రెండే అంశాలు సానుకూలంగా ఉంది. అధికారంలో ఉండటం, డబ్బుండటం.  ఈ రెండింతోనే టిడిపి జెండా ఎగురుతుందా ? మరి ఎలా ఎగరేస్తారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: