ప్రియాంక తొలి ప్రసంగంలో నాయనమ్మ ఇందిర కనిపించినా, వినిపించలేదు!

ఎవరైనా ఇందిరా గాంధిని చూసినవాళ్ళు,  ఆమె ప్రసంగం విన్నవాళ్ళు,  ఆమె లోని హుందాతనం, సూటిగా చూస్తూ మాట్లాడే తత్వం, ప్రసంగ ప్రవాహం, ప్రసన్నత, కొన్నిసార్లు  ఉద్వేగం మరచి పోరు పోలేరు. అయితే నేడు (మంగళ వారం) ఆమె గుజరాత్‌ లోని గాంధీనగర్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ కార్యదర్శిగా ఇది ఆమె మొదటి ర్యాలీ.     

"మీ ఓటే ఒక ఆయుధం" అని కాంగ్రెస్‌ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ నెహౄ వాద్రా ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు ఉపదేశం చేశారు. "ఆలోచించి, నిర్ణయం తీసుకోండి. మీ ముందు గొప్పగా మాట్లాడిన వ్యక్తి ఆయన హామీతో ఇచ్చిన ఉద్యోగాలు ఎక్కడో చెప్పరు. మహిళల భద్రత మాటేంటి?’ అని ప్రధాని లక్ష్యంగా విమర్శించారు  ఇది కూడా స్వాతంత్ర సమరానికి ఏమాత్రం తీసిపోదు. ఇప్పుడు విద్వేషం నుంచి విముక్తి"  అని స్వాతంత్ర సమరం సందర్భంగా ప్రారంభించిన  దండి యాత్ర ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

తొలిసారి ప్రసంగించిన ప్రియాంక గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా విమర్శలు గుప్పించినా ఆమె ముఖంలో హుందాతనం ప్రసన్నత ఎక్కడా కనిపించలేదు. "రెండు కోట్ల ఉద్యోగాలెక్కడ? అకౌంట్లో వేస్తామన్న రూ.15 లక్షలు ఎక్కడ? మహిళా భద్రత ఎక్కడ" అని ఆమె నిలదీసినా ఆ వాగ్ధాటి కనిపించలెదదు. అయితే ఖచ్చితం గా ఆమె భాషణ అటు తన తల్లి సోనియా గాంధి కంటే ఇటు తన అగ్రజుడు రాహుల్ గాంధి కంటే మాత్రం గొప్పగా ఉందని చెప్పవచ్చు. 

"ఓటే మీ ఆయుధం, దేశం ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులపై అవగాహన ఉండటమే అతిపెద్ద ఆయుధం" అని ప్రియాంక అన్నా శ్రోతలు మాత్రం ఆమె ముఖంలో ఇందిరా గాంధిని చూడటానికి ప్రయత్నించిన వారున్నారు. వారికి మాత్రం నిరాశే మిగిలింది. 


దేశ సమస్యల పట్ల అవగాహన ఉండటమే అసలైన దేశభక్తి అని ఆమె తెలిపారు. రాజ్యాంగ సంస్థలను నరేంద్ర మోదీ సర్కారు నిర్వీర్యం చేస్తోందని ఆరోపించిన ప్రియాంక, దేశంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. ప్రజల మధ్య విద్వేషాలను పెంచుతున్నారని విమర్శించారు. నిరుద్యోగం, రైతుల సమస్యలు, మహిళల భద్రత ప్రధాన అజెండాగా ఎన్నికలు జరగ బోతు న్నాయని ఆమె తెలిపారు. 


దేశంలో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతోందని, గుజరాతీలకు ఆ రెండు సిద్ధాంతాల గురించి తెలుసన్నారు ఇదే సభలో సోదరితో కలసి పాల్గొన్న రాహుల్ గాంధి. అందుకే ఇన్నేళ్ల తర్వాత గుజరాత్‌ లో సీడబ్ల్యూసీ సమావేశాన్ని నిర్వహించి నట్లు చెప్పారు. మరోవైపు పటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ కాంగ్రెస్ గూటికి చేరారు. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీడబ్ల్యూసీ సమావేశానికి రాహుల్‌తో పాటు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు హాజరయ్యారు. అభ్యర్థుల ఎంపికతో పాటు ఎన్నికల అనసరించిన వ్యూహంపై చర్చలు జరిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: