కల్కి... వెట్టైయాన్ మూవీలకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇచ్చిన రానా..!

MADDIBOINA AJAY KUMAR
తెలుగు తో పాటు అనేక భాషల సినిమాల్లో నటించి ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న నటులలో దగ్గుపాటి రానా ఒకరు. ఈయన తన కెరియర్ లో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు. అలాగే విలన్ గా కూడా నటించాడు. మరికొన్ని సినిమాల్లో ముఖ్య పాత్రల్లో కూడా నటించాడు. ఇలా తనకు పాత్ర నచ్చితే చాలు ఏ సినిమాలోనైనా , ఎవరితోనైనా నటిస్తూ వెళుతూ ఉండడంతో రానా కు ఇండియన్ సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేక ఇమేజ్ ఏర్పడింది. ఇది ఇలా ఉంటే తాజాగా రానా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.

అందులో భాగంగా ఈయన ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న కల్కి 2898 ఏడి మరియు వెట్టైయాన్ మూవీల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా రానా మాట్లాడుతూ ... నెక్స్ట్ బిగ్ మ్యుమెంట్ కల్కి అని చెప్పారు. ఈ మూవీ కి కేవలం భారతీయులు మాత్రమే కాదు ... ప్రపంచం లోని అందరూ కూడా కనెక్ట్ అవుతారు అంటూ రానా చెప్పుకొచ్చారు. కల్కి సైడ్ నుండి తనకి ఎవెంజర్స్ మూమెంట్ ఉంది అని కూడా రానా తాజా ఇంటర్వ్యూలో భాగంగా అన్నారు.

ఇక సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా రూపొందుతున్న వెట్టైయాన్ మూవీ గురించి రానా మాట్లాడుతూ ... ఇది సాధారణ రజినీ కాంత్ సినిమా కాదు. న్యాయవ్యవస్థ , పోలీసు , వ్యవస్థాపక వ్యవస్థలతో కూడిన డ్రామా అని రానా తెలిపారు. ఇలా తాజా ఇంటర్వ్యూ లో భాగంగా రానా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న కల్కి మరియు వెట్టైయాన్ మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. ఇకపోతే రజనీ కాంత్ హీరోగా రూపొందుతున్న వెట్టైయాన్ మూవీ కి జై భీమ్ ఫ్రేమ్ టిజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రానా కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: