పార్టీ మారడంపై.. విజయశాంతి కామెంట్స్ వైరల్?

praveen
తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇక తనకు ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ పార్టీలు మారుతూ వస్తున్నారు విజయశాంతి. మొదట్లో బిఆర్ఎస్ పార్టీలో చేరిన ఆమె ఆ తర్వాత అక్కడ తనకు గుర్తింపు ఇవ్వడం లేదని.. సొంత పార్టీ పెట్టారు. చివరికి ఆ సొంత పార్టీ వర్కౌట్ కాకపోవడంతో కమలం గూటికి చేరారు. అయితే అక్కడ ఇమడలేకపోయిన విజయశాంతి చివరికి కాంగ్రెస్ లోకి వచ్చారు. అయితే ఇక గత కొంతకాలం రాములమ్మ కాంగ్రెస్ పార్టీని కూడా విడబోతున్నారా అనే చర్చ మొదలైంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎక్కడ రాములమ్మ తెరమీద కనిపించలేదు.

 ఎక్కడ పోటీ చేయకపోవడమే కాదు కనీసం అభ్యర్థుల తరఫున ప్రచారం కూడా నిర్వహించలేదు. దీంతో ఇక ఇలా విజయశాంతి సైలెంట్ గా ఉండడానికి కారణమేంటి.. మళ్లీ పార్టీ మారబోతున్నారా అనే ప్రచారం తెరమీదకి వచ్చింది. అయితే ఇటీవల విజయశాంతి చేసిన వ్యాఖ్యలు అయితే ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చాయి. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ కనుమరుగు అవుతుంది అంటూ తెలంగాణ బిజెపి మాజీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ కామెంట్స్ చేశాడు. అయితే ఈ కామెంట్స్ పై స్పందించిన విజయశాంతి బిఆర్ఎస్ కనుమరుగవుతుంది అనడం  సమంజసం కాదని.. ఇప్పటివరకు ఎన్నో ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పాయి అంటూ కామెంట్స్ చేసింది.

 ఈ కామెంట్స్  సంచలనంగా మారిపోయాయి. బిఆర్ఎస్కు మద్దతుగా మాట్లాడిన విజయశాంతి మళ్లీ గులాబీ తీర్థం పుచ్చుకోబోతున్నారా అంటూ ప్రచారం మొదలైంది. అయితే ఈ విషయంపై అటు విజయశాంతి స్పందించారు. తాను పార్టీ మారడం లేదని సినీనటి కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి స్పష్టం చేశారు. తాను బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలలో నిజం లేదు అంటూ చెప్పుకొచ్చారు. దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీల స్వభావం గురించి మాట్లాడుతూ.. కొందరు పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు విజయశాంతి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: