హీరో రాజ్ తరుణ్ చేత చీర కట్టించుకోవాలనుకుంటున్న యాంకర్ గీతా భగత్..!!

murali krishna
టాలీవుడ్ యాంకర్స్ లో ఒకరైన గీతా భగత్ సినిమా ఈవెంట్స్ తో బిజీ బిజీగా గడుపుతున్నారు. ట్రైలర్ లాంచ్, టీజర్ లాంచ్, మూవీ ప్రెస్ మీట్స్ ఇలా మీడియం రేంజ్ చిత్రాల ఈవెంట్స్ కి ఎక్కువగా ఆమే కనిపిస్తూ ఉంటారు.టాలీవుడ్ యాంకర్స్ లో ఒకరైన గీతా భగత్ సినిమా ఈవెంట్స్ తో బిజీ బిజీగా గడుపుతున్నారు. ట్రైలర్ లాంచ్, టీజర్ లాంచ్, మూవీ ప్రెస్ మీట్స్ ఇలా మీడియం రేంజ్ చిత్రాల ఈవెంట్స్ కి ఎక్కువగా ఆమే కనిపిస్తూ ఉంటారు. వేదికపై తనదైన శైలిలో జోకులు వేస్తూ షోని నడిపించడం ఆమె శైలి.ఎలాంటి ఈవెంట్స్ లో అయినా అతిథులతో పాటు యాంకర్స్ చేసే కామెంట్స్ కూడా వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు ట్రోలింగ్ కి కూడా గురవుతుంటారు. యాంకర్ సుమ, శ్రీముఖి లాంటి వాళ్ళు గతంలో ఏదో చెప్పబోయి ఇంకేదో మాట్లాడి వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.తాజాగా యాంకర్ గీతా భగత్ కూడా ట్రోలింగ్ కి గురయ్యారు. ఇటీవల రాజ్ తరుణ్ నటించిన భలే ఉన్నాడే చిత్ర టీజర్ లాంచ్ జరిగింది. టీజర్ లో కంటెంట్ ని తాను కూడా ఇంప్రొవైజ్ చేయాలని అనుకుంది.సందర్భం రాగానే బోల్డ్ గా మాట్లాడేసింది. భలే ఉన్నాడే చిత్ర కథ టీజర్ ని బట్టి అర్థం అవుతోంది. సిటీల్లో జరిగే ఈవెంట్స్ కి ఆడవాళ్ళకి చీర కట్టుకోవడంలో సాయం చేసే వ్యక్తిగా రాజ్ తరుణ్ నటిస్తుంటాడు. ఈ సీన్స్ లో టీజర్ లో ఫన్నీగా, రొమాంటిక్ గా చూపించారు.రచయిత డార్లింగ్ స్వామి ఈవెంట్ లో ప్రసంగిస్తూ..యాంకర్ గీతాని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ఇంత మాట్లాడుతున్నారు.. మీరెందుకు చీర కట్టుకుని రాలేదు అని అడిగారు. దీనితో యాంకర్ గీతా బదులిస్తూ.. నాకు హీరో రాజ్ తరుణ్ చేత చీర కట్టించుకోవాలని ఉన్నట్లు గీతా భగత్ తన కోరిక బయట పెట్టింది.ఆమె మాటలకు అక్కడున్న వారంతా నవ్వేశారు కానీ.. ఆ తర్వాత ఆన్లైన్ లో గీతా భగత్ పై ట్రోలింగ్ జరిగింది.వైరల్ కావడం కోసం నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హీరో చేత చీర కట్టించుకోవడం ఏంటి అంటూ ట్రోలింగ్ షురూ చేశారు.గతంలో గీతా భగత్ పై కొన్ని కాంట్రవర్సీలు కూడా వైరల్ అయ్యాయి. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో తీవ్ర వివాదాలు జరిగాయి. పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: