అక్కినేని ఇంత కొత్త పంచాయతీ?

Veldandi Saikiran

అక్కినేని కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ప్రత్యేకమైన పేరు, ప్రఖ్యాతలు ఉన్నాయి. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య ఇలా అక్కినేని కుటుంబ సభ్యులు అందరూ సినిమాలలో నటిస్తూ వారి కుటుంబాన్ని గొప్ప స్థానంలో నిలుపుతున్నారు. ఇక గత కొద్దిరోజులు క్రితమే అక్కినేని కుటుంబంలో పెళ్లి భాజలు మోగాయి. అక్కినేని నాగచైతన్య నటి శోభిత ధూళిపాలను ప్రేమించి వివాహం చేసుకున్నారు.


చాలా కాలం పాటు ప్రేమించుకున్న ఈ జంట పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహాన్ని జరుపుకున్నారు. వివాహం తర్వాత నాగచైతన్య, శోభిత ఎంతో అన్యోన్యంగా వారి వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు. రీసెంట్ గానే ఈ జంట హనీమూన్ ట్రిప్ కి కూడా వెళ్లారు. అక్కడ నాగ చైతన్య, శోభిత కలిసి ఎంజాయ్ చేశారు. అక్కడ వారు తీసుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోని అక్కినేని కుటుంబానికి సంబంధించి ఓ వార్త విపరీతంగా వైరల్ అవుతుంది.



 అయితే నటి శోభిత, నాగచైతన్య వేరే కాపురం పెట్టాలని నిర్ణయం తీసుకున్నారట. శోభితకు తరచూ అక్కినేని అమలతో గొడవలు జరుగుతున్నాయట. అత్త, కోడళ్ళ మధ్య గొడవలు విపరీతంగా జరుగుతుండడం వల్ల నాగచైతన్య వేరే ఇంటికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారట. అయితే నాగచైతన్య అమలకు సొంత కొడుకు కాకపోవడం వల్లనే ఇలా గొడవలు జరుగుతున్నాయని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.



కానీ నాగార్జున మాత్రం వేరే ఇంటికి వెళ్లడానికి అసలు ఒప్పుకోవడం లేదట. అందరం కలిసి ఒకే ఇంట్లో ఉందామని చెబుతున్నాడట. మరి ఈ విషయం పట్ల నాగ చైతన్య ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. ఈ విషయం గురించి నాగచైతన్య ఏదో ఒక క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం బయటికి రాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: