వావ్: బిజినెస్ లో గట్టిగానే అందుకుంటున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి..!

Divya
నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా నటిస్తున్న మాస్ చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్లో తెరకెక్కించారు. కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే ఈ సినిమా 21వ సినిమాగా తెరకెక్కించారు. భారీ బడ్జెట్ తో యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో విజయశాంతి నటిస్తూ ఉన్నది. ఇటీవలే విడుదలైన టీజర్ ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన రావడంతో ఈ సినిమాకి బిజినెస్ పరంగా కూడా బాగానే జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


గ్రామీణ నేపథ్యంలో సాగేటువంటి కథ అంశం ఉన్నట్లుగా ఈ టీజర్ చూస్తే అనిపిస్తోంది .సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా శ్రీకాంత్ , సోహెల్ ఖాన్ తదితర నటీనటులు కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఈనెల 18వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతూ ఉండగా బిజినెస్ కూడా అదిరిపోయేలా జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమా థియేటర్ల హక్కుల పరంగా బాగానే అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఆంధ్ర హక్కు 12 కోట్ల రూపాయలు పలికినట్లు తెలుస్తోంది.


ఈ లెక్కన చూసుకుంటే అక్కడ అడ్వాన్స్ బుకింగ్ కూడా బాగానే జరిగేలా ఉన్నది. రాయలసీమ హక్కులు 3.70 కోట్ల రూపాయలకు డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. అలాగే తాజాగా నైజాం రైట్స్ కూడా క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నైజాం రైట్స్ ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ కళ్యాణ్ రామ్ మార్కెట్కు మరింత బలాన్ని చేకూర్చేలా కనిపిస్తోంది. ఈనెల 12వ తేదీన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్గా నిర్వహించేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం జూనియర్ ఎన్టీఆర్ ని కూడా ప్రత్యేకించి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మరి కళ్యాణ్ రామ్ కెరియర్ లోని ఈ సినిమా బెస్ట్ గా నిలుస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: