కుల బలం సంగతి తేలుద్దామా.. జగన్కు ఆర్కే సవాల్..?

Chakravarthi Kalyan

తెలుగు మీడియా ఓ సామాజిక వర్గం చేతిలో ఉన్నదన్న ఆరోపణ ఈనాటిది కాదు. ఈ ఆరోపణ అసంబద్దమూ, అబద్దమూ కూడా కాదు. తెలుగు పత్రికలు, టీవీలు, సినిమాలు.. అన్నింటా ఓ సామాజిక వర్గం ఆధిపత్యం ఉన్నదన్న విషయాన్ని ఎవరూ కాదనలేరు. అబ్బే అలాంటిదేమీ లేదు.. అంటూ ఎవరైనా మాట్లాడినా నమ్మే అమాయకులు ఎవరూ లేరు.

 



ఇందులో కొన్ని పత్రికలు, టీవీలు పూర్తిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు కరపత్రాలుగా మారిన సంగతి కూడా తెలుగు ప్రజలకు తెలిసిన విషయమే. వైఎస్ బతికున్నప్పుడు కూడా ఆ రెండు పత్రికలు అంటూ ఎండగట్టి .. వాటి ధాటి నుంచి కాపాడుకునేందుకు ఏకంగా ఆయన కూడా సొంత మీడియా హౌజ్ పెట్టుకోవాల్సి వచ్చిందంటే అందుకు కారణం ఆ సామాజిక వర్గ ఆధిపత్యమే.



ఐతే.. ఓ సామాజిక వర్గ ఆధిపత్యానికి, దుష్ప్రచారానికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన మీడియాలో కూడా మళ్లీ అదే పోకడలు చోటుచేసుకోవడం విచిత్రం.. విచారకరం కూడా. వైఎస్ సొంత మీడియా కూడా తమ సామాజిక వర్గానికే పెద్ద పీట వేసింది. అన్నివిభాగాల్లోనూ తమ వారినే కీలక స్థానాల్లో పెట్టుకున్నారు. అందుకే తాజాగా ఓ పత్రిక ఎండీ ఆర్కే.. తన వ్యాసంలో జగన్ కు సవాల్ విసిరారు.



తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అండ లభించిన తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వంటివారు హద్దుమీరి మాట్లాడుతున్నారని.. తమకు గిట్టని పత్రికలకు కులం ఆపాదించడానికి కూడా విజయసాయిరెడ్డి వెనుకాడటం లేదని ఆర్కే రాసుకొచ్చారు.  జగన్‌ మీడియాలో వివిధ శాఖాధిపతులు, విభాగాల అధిపతులు ఏ కులానికి చెందినవారో విజయసాయిరెడ్డి బయటపెడితే ఎవరిది ఏ కులపత్రికో ప్రజలకు తెలుస్తుందంటూ సవాల్ విసిరారు. విజయసాయిరెడ్డి అందుకు సిద్ధమైతే మేం కూడా సిద్ధమంటున్నారు. మరి ఈ సవాల్ కు జగన్ మీడియా స్పందిస్తుందా..?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: