'నువ్! లంగా పనులు చేస్తే రామూ సినిమా తీస్తాడు!' ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రోగ్రాంలో పోసాని

వివాదాల వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి తెలిసిందే. అన్ని వివాదాల నడుమ ఈ సినిమా సెన్సార్ తలుపు తట్టేటానికి వెళ్లేందుకు సమయత్తమైంది. ఈనెల 22న సినిమా రిలీజ్ తేదీని ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. నేటి సాయంత్రం సింహ గర్జన పేరుతో ఆర్జీవీ బృందం మీడియా లైవ్ లోకి వచ్చింది. ఈ లైవ్ కార్యక్రమంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఒక కీలక పాత్ర పోషించిన పోసాని కృష్ణమురళి - సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సంచలన కామెంట్స్ చేశారు దర్శక, రచయిత పోసాని క్రిష్ణ మురళి. వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం నాడు హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని వైభవం గా నిర్వహించారు. 


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోసాని కృష్ణమురళి లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర విడుదలకు అడ్డంకులు కలిగించే వారికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఏ తప్పూ చేయక పోతే ఎందుకు భయపడుతున్నారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ గురించి చాలా మంది చాలా చెబుతున్నారు. ఈ సినిమా బయటకు రానివ్వరు. సెన్సార్ దగ్గర ఆపేస్తారు. ఒక వేళ సెన్సార్ అయినా విడుదలను పలానా పార్టీ వాళ్లు అడ్డు కుంటారు. థియేటర్స్ వద్ద పెద్ద గొడవ, అల్లర్లు చేస్తారు అంటున్నారు. 

“ఇవన్నీఎందుకు? వెధవ వేషాలు వేయడం దేనికి? నువ్ నిజాయితీగా ఉండొచ్చు కదా! ఎవడైతే నీతిగా ఉండడో! నిజాయితీగా ఉండడో! నీతి వంతమైన రాజకీయాలు చేయడో!  వాడికే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి.” 


“ఎవడైతే వెధవ వేషాలు వేస్తాడో వాడికే కష్టాలు, కన్నీళ్లు, కోపాలు, బాధలు వస్తాయి. అవినీతి పనులు చేసిన వాడు, వెన్నుపోటు పొడిచిన వాడే బాధ పడుతుంటాడు. నువ్ ఆరోజు ఆ పనిచేసి ఉండక పోతే రాము ఈరోజు ఈ సినిమా తీయడుకదా! రామాయణమో, మహాభారతమో తీసుకుంటాడు కదా! నువ్ వెధవ వేషాలు వేస్తే సినిమా తీయడానికి రాము రెడీగా ఉంటాడు. రాము తప్పు చేసిఉంటే ఆయన మీద ఆయనే సెటైర్ వేసుకుంటాడు. తప్పు చేస్తే ఒప్పుకుంటాడు” 

“నువ్! ప్రజాస్వామ్యం లో ఉండి, ప్రభుత్వంలో ఉండి, రాజకీయాల్లో ఉండి నువ్! లంగా పనులు చేస్తుంటే రాము ఎందుకు విడిచిపెడతాడు? ఒకవేళ నేను రాజకీయాల్లోకి వచ్చి సన్నాసి పనులు, వెధవ పనులు చేసినా రాముకి నన్ను తిట్టే హక్కు ఉంది. ఎందుకంటే అతను సిటిజన్, ఓటరు కూడా అందుకే అడిగే హక్కు ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడ నుండి సెన్సార్ వాళ్లకు చెబుతున్నా ఇది జరిగిన కథ.” 


సినిమాలో ఎవడు నీతి మంతుడై ఉన్నాడో వాడికి ఓట్లు పడతాయి. వెధవ పనులు చేశాడని ప్రజలు అభిప్రాయ పడితే ఖచ్చితంగా సర్వ నాశనం అయిపోతాడు” అంటూ చంద్రబాబు పేరును ప్రస్తావించ కుండా ఆయనపై సంచలన కామెంట్స్ చేశారు పోసాని కృష్ణ మురళి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: