టిడిపి పార్టీలో పెరిగిపోతున్న అసమ్మతి సెగలు..!

KSK
ఇప్పటికే పార్టీ నుండి బయటికి వెళ్లి పోతున్న చాలా మంది ప్రముఖులతో తల పట్టుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు కి సొంత పార్టీ మంత్రులు ఇంకా తలనొప్పిగా మారుతున్నారు. ఒకపక్క త్వరలో జరగబోయే రాష్ట్రంలో ఎన్నికల విషయంలో తెలుగుదేశం పార్టీకి అధికారం రావడం చాలా కష్టమని ఫలితాలు వస్తున్న సమయంలో ఇప్పుడు సొంత పార్టీ మంత్రులు కూడా అధినేత చంద్రబాబు కి పిచ్చ ఆగ్రహం తెప్పిస్తున్నారు.


ఇంతకి విషయం ఏమిటంటే తెలుగుదేశం లో కొందరు మంత్రులకు అసమ్మతి సెగ తగులుతోంది. ఎపిలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న కెఎస్ జవహర్ కు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు ర్యాలీలు తీస్తే, వారికి పోటీగా జవహర్ ర్యాలీ తీశారు.


ఆయనకు టిక్కెట్ ఇవ్వరాదని అసమ్మతి నేతలు డిమాండ్ చేస్తున్నారు. అదే దారిలో మరో మంత్రి కాల్వ శ్రీనివాసులు కూడా అసమ్మతి బెడద ఎదరుఐనట్లు వారత్లు వస్తున్నాయి. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గానికి ఆయన ప్రాతినిద్యం వహిస్తున్నారు. ఆయనకు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టిక్కెట్ ఇవ్వరాదంటూ అసమ్మతి కణేకల్ లో సమావేశం అయి తీర్మానించారు.


కాల్వకు టిక్కెట్ ఇస్తే సహకరించబోమని వారు అంటున్నారు. కాగా నిడదవోలు, కళ్యాణదుర్గం, కనిగిరి వంటి నియోజకవర్గాలలో కూడా టిడిపికి అసమ్మతి ఎదురు అవుతోంది. దీంతో ఈ వ్యవహారాలన్నీ అధినేత చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఎన్నికల ముందు ఇటువంటివి చేయడం పార్టీకి కొంత డ్యామేజ్ అవుతుందని బాబు కామెంట్ చేసినట్టు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: