భారత్‌ మెరుపు దాడుల అసలు టార్గెట్‌ వీళ్లేనా..? ఎందుకు..?

Chakravarthi Kalyan

ఉగ్రవాద ముఠాలే లక్ష్యంగా భారత్ పాకిస్తాన్ పై మెరుపుదాడి చేసింది. అసలు ఇంతకీ అసలు టార్గెట్ ఎవరు.. వారినే ఎందుకు లక్ష్యంగా ఎంచుకున్నారు.. ఈ ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం.. ఈ దాడుల మొదటి టార్గెట్ జైష్--మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధిపతి మసూద్ అజర్‌ బావమరిది యూసుఫ్ అజర్‌. ఈ దాడుల్లో ఇతన్ని చంపామని భారత్ ధ్రువీకరిస్తోంది.



యూసుఫ్ అజర్‌ బ్యాక్ గ్రౌండ్ ఓసారి పరిశీలిస్తే... 1999లో ఐసీ-814 విమానం హైజాక్‌లో అజర్ కీలకపాత్ర పోషించాడు. ప్రయాణికుల కోసం అప్పట్లో మసూద్అజర్‌ను భారత్ విడుదల చేసింది. 2002లో మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాను 20 మంది పేర్లతో భారత్.. ఇస్లామాబాద్‌కు పంపింది. ఇందులో యూసఫ్ అజర్ కూడా ఉన్నాడు.



బాలాకోట్, చకోటీ, ముజఫరాబాద్ ల్లో జైష్--మొహమ్మద్‌కి సంబంధించిన శిక్షణ శిబిరాలను యూసుఫ్ అజర్ నడుపుతున్నాడు. ఇదే బాలాకోట్‌ ప్రాంతంలోనే పుల్వామా దాడికి సంబంధించిన ప్రణాళికలు రచించారని భారత్ భావిస్తోంది. పుల్వామాలో ఆత్మాహుతికి పాల్పడ్డ ఘాజీ ఇక్కడే ట్రైనింగ్ తీసుకున్నాడు.



భారత్ మెరుపు దాడిలో యూసుఫ్ అజర్‌తో పాటు మసూద్ అజర్ సోదరుడు మౌలానా తల్లా సైఫ్‌, మౌలానా అమ్మార్‌, ముఫ్తీ అజ‌ర్ ఖాన్, ఇబ్రహీం అజ‌ర్‌ కూడా హతమయ్యారని భారత్ భావిస్తోంది. కాశ్మీర్, ఆఫ్ఘనిస్థాన్‌లలో జరిగిన ఎన్నో టెర్రరిస్ట్ కార్యకలాపాల్లో వీరే సూత్రధారులు


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: