పశ్చిమ బంగలో ఏం జరుగుతుంది? ఆసలు మమత అంతరంగంలో నమ్మకం సడలుతుందా?

పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి కూడా రాష్ట్ర అంతర్గతంగా ఏదో సమస్య ఉన్నట్లుగా ఉంది.లేదా బిజెపి అంటే భయపడుతున్నట్లుగా ఉంది. బిజెపి కేంద్ర నాయకులకు బహిరంగ సభలకు అనుమతులివ్వని మమత,  కనీసం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్, బిజెపి అద్యక్షుడు అమిత్ షాల హెలికాప్టర్ లను కూడా బెంగాల్ భూబాగంలోకి  అను మతించలేని ఆమె ప్రభుత్వం,  తాజాగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హెలికాప్టర్ లాండ్ కావడానికి కూడా అంగీకరించలేదట. దాంతో ఆయన పాల్గొనవలసిన సభలు రద్దు అయ్యాయి. రహదారి మార్గంలో ఆయన కొన్ని సభలకు మాత్రమే వెళ్లవలసి వచ్చింది.

పశ్చిమ బంగ ప్రజాస్వామ్య భారత్ లో ఒక రాష్ట్రం. అలాంటి దేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాధినేత ప్రధాని నరేంద్ర మోడీ సభలకు కూడా అనుమతి నివ్వక పోవటం, అలాగే అధికార పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కు కూడా జరగటం అందరికి ముఖ్యంగా ప్రజాస్వామ్య వాదులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థ లకు ప్రవేశనిషేధం విధించటం - కూడా శోచనీయం. ఒక ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఇంత నియంతృత్వం చేయగలుగు తున్నారనేది కూడా ప్రశ్నార్ధకమే. 

అంతే కాదు ఇతర రాష్ట్రాల బిజేపి నాయకులకు సైతం రాష్ట్రంలో బహిరంగ సభలకు అనుమతి నిరాకరించటం వారి హెలీకాప్టర్ లాండింగుకు అనుమతి నివ్వకపోవటం అసలు మనం ప్రజా స్వామ్యం దేశం లోనే ఉన్నామా? అనే సంశయం వస్తుంది. 

ఇలాంటి రాజకీయవేత్త సేవ్ డెమాక్రసీ - సేవ్ నేషన్ అని ఎలా అనగలుగుతుంది? ఇలాంటి వ్యక్తి దేశప్రధాని కావాలని కలలుకంటుందో అర్ధం కాదు. బెంగాలీలు సాధారణంగా స్వాతంత్ర ప్రియులు. అలాంటి వారు ఈమె నియంతృత్వాన్ని ఎలా భరించ గలుగుతున్నారో? అర్ధంకావటం లేదంటున్నారు ఆ రాష్ట్రం ఇరుగు పొరుగు రాష్ట్రాల ప్రజలు. అసలు బెంగాల్లో ఏం జరుగు తుందనేది సామాన్య భారతీయుల ప్రశ్న. ఆ రాష్ట్రంలో బిజేపి బలం పెరిగిపోతుండటంతో నిరాశ నిస్పృహలతో మమత అంతరంగంలో దహించుకు పోతున్నారా? ఆమె దైహిక బాష సైతం అలాగే ఉంటుందని అంటున్నారు రాజకీయ నిపుణులు విశ్లేషకులు కూడా. 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: