ఆ విషయంలో జగన్‌ ది ప్రపంచ రికార్డ్..?

Chakravarthi Kalyan

అవును.. ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ప్రపంచ రికార్డు సృష్టించారట. ఈ విషయం సాక్షాత్తూ ఏపీ సీఎం చంద్రబాబు చెబుతున్నారు. ఇంతకూ ఈ రికార్డు ఏ విషయంలోనో తెలుసా.. అసెంబ్లీకి వెళ్లుకుండా ఉంటున్నందుకట. ప్రపంచంలో ఏ పార్టీ కూడా ఇంతకాలం అసెంబ్లీ వెళ్లకుండా లేరట.



సో.. ఈ విషయంలో జగన్ కు ప్రపంచరికార్డ్ ఇవ్వొచ్చంటూ ఏపీ సీఎం ఘాటుగా కామెంట్ చేశారు. తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యేలతో మాట్లాడిన చంద్రబాబు జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారట. ప్రపంచంలోనే ఇంత నిర్లక్ష్యంగా ఉన్న నాయకుడు లేడని చంద్రబాబు సూత్రీకరిస్తున్నారు.



జగన్ అసెంబ్లీకి రాడు.. సమాచార కమీషనర్ల నియామాకానికి హాజరు కాడు.. అఖిలపక్ష బేటీలకూ రాడు.. ఇదంతా జగన్ మోహన్‌ రెడ్డి బాధ్యతారాహిత్యానికి పరాకాష్టం అంటూ మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు. కానీ ఇంతకూ జగన్ అసలు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు.. అని మాత్రం చంద్రబాబు తనను తాను ప్రశ్నించుకునే ఛాన్సేలేదు.



మరి అసలు ఏం జరిగింది. ఎన్నికలైపోయిన తర్వాత అధికారపార్టీ తన ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నారన్నది జగన్ ఆరోపణ. తన పార్టీ ద్వారా గెలిచిన వారు టీడీపీ కండువాలు వేసుకుని అసెంబ్లీలో కూర్చుని ఉంటే.. ఈ సీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉంటే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడుందని జగన్ ప్రశ్నిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: