ఎడిటోరియల్ : చంద్రబాబుకు డేంజర్ సిగ్నల్స్..అందుకే అత్యవసర సమావేశం ?

Vijaya

షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ చంద్రబాబునాయుడులో భయం మొదలైందా ? అమరావతి కేంద్రంగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అందరిలోను అవే అనుమానాలు మొదలయ్యాయి. లేకపోతే అంత అర్జంటుగా లగడపాటి రాజగోపాల్, ఏబిఎన్ ఎండి రాధాకృష్ణతో భేటీ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది ? సోమవారం అర్ధరాత్రి తర్వాత అమరావతిలో చంద్రబాబు, లగడపాటి, రాధాకృష్ణలు దాదాపు రెండు గంటల పాటు సమావేశమైన విషయం అందరికీ తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ గెలుపుపై అందరిలో లాగే చంద్రబాబులో కూడా అనుమానాలు మొదలైనట్లున్నాయి.

 

దానికితోడు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో గెలుపెవరది ? అన్న విషయమై జాతీయ మీడియా నిర్వహించిన ప్రతీ సర్వేలోను వైసిపికే పూర్తి ఆధిక్యత కనబడింది. మొత్తం 25 లోక్ సభ సీట్లలో వైసిపికి 20 సీట్లు వస్తాయని, టిడిపికి 5 సీట్లు  మాత్రమే వస్తాయని సర్వేలు తేల్చేశాయి. అదే సమయంలో చంద్రబాబు సొంతంగా చేయించుకుంటున్న సర్వేల్లో కూడా టిడిపి అధికారంలోకి వస్తుందని ఎక్కడా స్పష్టంగా రాలేదట. దాంతో చంద్రబాబులో టెన్షన్ మొదలైంది.

 

అందుకే లగడపాటి, రాధాకృష్ణలతో అర్జంటు మీటింగ్ పెట్టారని అంటున్నారు. ఇదే త్రయం తెలంగాణా ఎన్నికల్లో కూడా మహాకూటమిని గెలిపించాలని తెగ తాపత్రయపడ్డా జనాలు మాడు పగలగొట్టిన విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు, రాధాకృష్ణ కోసమని తప్పుడు సర్వే రిపోర్టులిచ్చినందుకు లగడపాటి కూడా క్రెడిబులిటీ పోగొట్టుకున్నారు. తెలంగాణా అయిపోయింది ఇపుడు మళ్ళీ ఏపి ఎన్నికల విషయంలో జాయింట్ మీటింగ్ పెట్టుకున్నారు. రేపటి ఎన్నికల్లో టిడిపికి జాకీలేసి ఎలాగ ఎన్నికల్లో గెలిపించాలనే విషయంలో సుదీర్ఘ చర్చలు జరిగినట్లు సమాచారం.

 

తాజాగా లగడపాటి చేసిన సర్వేల్లో టిడిపి పరిస్ధితి భయంకరంగా ఉందని తేలిందట. దాంతో డ్యామేజీ కంట్రోలు ఎలా చేయాలి ? మళ్ళీ సర్వేల పేరుతో జనాలను ఎలా మాయ చేయాలనే విషయంలో లగడపాటి సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో జనాలను మాయ చేయటానికి ఎటూ రాధాకృష్ణ మీడియా ఉండనే ఉంది.  అంతేకాకుండా ఏ నియోజకవర్గంలో అభ్యర్ధి ఎవరైతే బాగుంటుందనే విషయంలో కూడా లగడపాటి సర్వే చేసినట్లు చెబుతున్నారు. పనిలో పనిగా వైసిపి పరిస్ధితి మీద కూడా చంద్రబాబుకు లగడపాటి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే చంద్రబాబు చేసిన తప్పుడు నిర్ణయాలు తన మీడియాలో ఎక్కడా కనబడకుండా రాధాకృష్ణ దాచేస్తున్నారు. అదే సమయంలో జనాల్లో చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకత బయటపడకుండా మ్యానేజ్ చేస్తున్నారు.

 

ఈ మ్యానేజ్ మెంటు సరిపోదన్నట్లుగా ముందు ముందు మరిన్ని పాజిటివ్ వార్తలను వండి వడ్డించేందుకు బహుశా రంగం సిద్ధం చేసినట్లే కనబడుతోంది. ముందుగా టిడిపి బాగా బలహీనంగా ఉన్న నియోజకవర్గాలేవి అన్న విషయంలో చర్చ జరిగిందట. అదే సమయంలో వైసిపి బలంగా ఉన్న నియోజకవర్గాలు, విజయావకాశాలపైన కూడా చర్చ జరిగిందట. సో, జరుగుతున్న విషయాలు చూస్తుంటే చంద్రబాబులో టెన్షన్ బాగా పెరిగిపోతున్నట్లే అర్ధమవుతోంది. అందుకనే జనాలకు మళ్ళీ ఇంకోసారి ఆచరణ సాధ్యం కాని హామీలతో ఊదరగొడుతున్నారు. మరి జనాలు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: