ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఇదే తరుణంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాలకు ఇప్పటికే వైసీపీ, టిడిపి, కాంగ్రెస్ వారి వారి అభ్యర్థులను ప్రకటించారు. ఇదే తరుణంలో ఈ పార్టీలో నుంచి పోటీ చేసే నాయకులు తప్పనిసరిగా ఎన్నికల సంఘానికి వారి యొక్క ఆస్తులు వివరాలు చూపించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఒక్కొక్క నాయకుడు వారి యొక్క ఆస్తుల వివరాలు తెలియజేశారు. ఇందులో చాలామంది నాయకులు వందల కోట్లకు పైగానే పడగలెత్తారు. మరి వారెవరు ఆ వివరాలు ఏంటో చూద్దాం.. ఆంధ్రాలో పేదరికం, దరిద్రం ఉందని చెబుతూ ఉంటారు. ఇవన్నీ వినడానికి బాగుంటాయి తప్ప చేతల్లో అలాంటి పరిస్థితి లేదు.
కనీసం ఆంధ్రలో చద్దన్నం ఇస్తే తినడానికి లేని పరిస్థితి ఉందట. ఇప్పటికే ఆంధ్రలో పనిచేయడానికి మనుషులు దొరక్క ఛత్తీస్ ఘడ్, యూపీ నుంచి చాలామంది వలసలు వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు. మరి అలాగని మనవాళ్లు సోమరిపోతులు లేదంటే ఎదిగారా అనేది మనకి మనమే ఆలోచించుకోవాలి. ఇదంతా పక్కన పెడితే మన రాష్ట్రంలో ప్రస్తుతం వివిధ పార్టీల నుంచి బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు వందలాది కోట్లకు పడగలెత్తారు. వారి ఆస్తుల వివరాలు చూస్తే నోరేళ్లబెట్టాల్సిందే. మొత్తం 23 మంది 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నవారేనట. ఇందులో పెమ్మసాని చంద్రశేఖర్ 5785కోట్లు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 710కోట్లు, సీఎం రమేష్ 497 కోట్లు, భరత్ 393, పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి 209, సింహాద్రి చంద్రశేఖర్ 138 కోట్లు, బాలశౌరి చంద్రశేఖర్ 133, షర్మిల 132 కోట్లు పార్లమెంట్ అభ్యర్థులు ఉన్నారు.
అసెంబ్లీ విషయానికి వస్తే నెల్లిమర్ల మాధవి 894, నారాయణ 824, చంద్రబాబు నాయుడు 810 కోట్లు, జగన్ 750, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి 710, నారా లోకేష్ 542 కోట్లు, ఏవి సత్యనారాయణ 420 కోట్లు, మాధవి రెడ్డి కడప 325 కోట్లు, టీజీ భరత్ కర్నూలు 245, బొల్లం బ్రహ్మనాయుడు 219, మేకపాటి విక్రం రెడ్డి 209, నందమూరి బాలకృష్ణ 154, బీసీ జనార్దన్ రెడ్డి టిడిపి బనగానపల్లి 173, పవన్ కళ్యాణ్ 164, బి వెంకటకృష్ణారెడ్డి 153, విడదల రజిని 129, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 114, బి నరేంద్ర వర్మ 109, విష్ణు కుమార్ రాజు 106కోట్లు ఆస్తులు కలిగి ఉన్నారు. ఇందులో హైయ్యెస్ట్ గా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నేతలే అపర కోటీశ్వరులుగా పార్లమెంటు అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నారు.