పేదోడికి నెలనెలా డబ్బు.. పథకం ప్రకటించిన రాహుల్‌.. ఈ దెబ్బతో మోడీ ఔట్..?

Chakravarthi Kalyan

సార్వత్రిక ఎన్నికలకు ముందు మోడీ సర్కారుకు దిమ్మతిరిగేలా కాంగ్రెస్ బ్రహ్మాస్త్రం ప్రయోగించింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే పేదవాడికి ఆదాయ భద్రత పథకం ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. పేదరికాన్ని రూపు మాపకుండా దేశాన్ని ముందుకు తీసుకెళ్లలేమని రాహుల్ ప్రకటించారు.


హర్యానాలో జరిగిన ఓ రైతుల సభలో ప్రసంగించిన రాహుల్ ఈ సంచలన ప్రకటన చేశారుఈ పథకం ప్రకారం దేశంలోని పేదలందరికీ ప్రతి నెలా తమ ఖాతాల్లో కొంత మొత్తం జమ చేస్తారన్నమాట. అంటే ఈ దేశంలో పేదవాడు ఎవరూ ఆకలితో మరణించే అవకాశం ఉండదన్నమాట.



నిజంగా ఈ పథకం ప్రకటన సాహసమే. దేశవ్యాప్తంగా పేదలకు నెలనెలా సొమ్ము ఖాతాలో వేయాలంటే ఖర్చు వేల కోట్లలో ఉంటుంది. మరి అంత భారం బడ్జెట్ రీత్యా సాధ్యపడుతుందా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సిక్కిం ప్రభుత్వంఈ తరహా పథకం అమలు చేస్తోంది కూడా.



ఏదేమైనా ఈ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తే ఓట్ల వర్షం కురవడం ఖాయం. వచ్చే ఎన్నికల్లో మోడీకి ఎదురుగాలి తప్పదని ఇప్పటికే సర్వేలు చెబుతున్నాయి. ఈ సమయంలో ఇలాంటి హామీలను ఎదుర్కోవాలంటే మోడీకి చిక్కులే. మరి దీనికి విరుగుడుగా మోడీ ఎలాంటి పథకాలు ప్రకటిస్తాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: