ఆ మంత్రి జనసేనలోకి వస్తానంటే... పవన్ కల్యాణ్ వద్దన్నాడా ?

Chakravarthi Kalyan

ఇప్పుడు ఏపీ మంత్రి జనసేన వైపు చూస్తున్నాడా.. జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడా.. అవునంటున్నాయి జనసేన వర్గాలు. ఆయన ఎవరో కాదు.. మంత్రి గంటా శ్రీనివాసరావు. గతంలో చిరంజీవితో కలసి ఈయన ప్రజారాజ్యంలో పని చేశారు.కానీ గంటా శ్రీనివాసరావు చేరికకు జనసేనాని పవన్ కల్యాణ్ ఏమాత్రం సిద్ధంగా లేడట.



అందుకే ఆయన గంటాపై నేరుగా ఘాటుగా కామెంట్ చేశారు. గంటా శ్రీనివాసరావు వంటి అవకాశవాదులను తాను ఏమాత్రం నమ్మబోనని మొహమాటం లేకుండా చెప్పేశారు. గంటా లాంటి వ్యక్తులు పక్షుల్లా వచ్చి చేరతారు.. అలాగే ఎగిరిపోతారు అంటూ పవన్ కామెంట్ చేశారు.



తన అన్న చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసేందుకు గంటా శ్రీనివాసరావు వంటి వ్యక్తుల ప్రోద్బలమే కారణమన్నది పవన్ కల్యాణ్ అభిప్రాయంగా చెబుతున్నారు. అందుకే మంత్రి గంటాను జనసేనలోకి రమ్మని ఆహ్వానించబోమని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పేశారు. గంటా శ్రీనివాసరావుపై తనకు కోపం లేదని... ఆయన ఆలోచనలు జనసేనకు సరిపడవని పవన్ అంటున్నారు.



వెన్నుపోటు పొడిపించుకునేంత బలహీనుడిని కాదని తాను కాదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 2019లో పదునైన వ్యూహంతో ఏపీ అసెంబ్లీలోకి జనసేన అడుగు పెడుతామని పవన్ అంటున్నారు. రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే ఆ బురదలో దిగక తప్పదని.. అందులోనే కమలంలా జనసేనను వికసింపజేస్తామని పవన్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: