ఏపీలో అవస్థలు పడుతున్న కాంగ్రెస్ పార్టీ..!

KSK
విభజన చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 ఎన్నికలలో డిపాజిట్లు కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. అన్యాయంగా అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి అటు తెలంగాణాలోనూ ఇటు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతింది.


ఈ నేపథ్యంలో మరికొద్ది నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో పొత్తుల విషయంపై ఏపి పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి మాట్లాడుతు ఏపి అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటి చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. పొత్తులు లేకుండా 175 స్థానాల్లో పోటిచేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ని ప్రధాని చేయడమే లక్ష్యంగా తమ కార్యాచరణ ఉంటుందన్నారు.


ప్రజలకు మంచి జరగాలంటే కాంగ్రెస్‌కు మాత్రమే ఓటు వేయాలని వేరే ఎవరికి వేసిన నష్టమని రఘువీర్‌ అన్నారు.  ఇది ఏఐసీసీ తీసుకున్న నిర్ణయమని.. ఏపీ ఇంఛార్జి ఉమెన్ చాందీ ద్వారా తమకు తెలియజేశారని రఘువీరా తెలిపారు. టిడిపి తో అవగాహన జాతీయ రాజకీయాలకు మాత్రమే పరిమితమని తెలిపారు.


ఈ నెల 31న అన్ని నియోజకవర్గాల నాయకులతో సమావేశం నిర్వహించి.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచి ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తుకు ముడిపడి ఉందన్నారు. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు జరుగుతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి .



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: