అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానంటున్న నారా లోకేష్..!

KSK
ఇటీవల దావోస్ పర్యటన తన తండ్రి ఏపీ సీఎం చంద్రబాబు కి బదులుగా మంత్రి నారా లోకేష్ దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు లో పాల్గొనబోతున్నారు. ఇటీవల దావోస్ కు బయలుదేరిన ఆయన అక్కడికి చేరుకున్నట్లు తెలిపారు.


ముఖ్యంగా అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ఏపీ సీఎం చంద్రబాబు రాలేకపోయారని ఆయనకు బదులుగా తాను వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు వచ్చి ఉండి ఉంటే బాగుండేదని కానీ కొన్ని కార్యక్రమాల వల్ల అమరావతిలోనే ఉండాల్సి వచ్చింది అన్నారు.


ఐదు రోజుల పాటు జరగనున్న ఈ పర్యటనలో విభజనతో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది అన్న విషయాన్ని ప్రపంచదేశాల్లో దృష్టికి తీసుకెళ్ల పోతున్నట్లు అందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల తన ట్విట్టర్లో ఈ పర్యటన గురించి సంచలన కామెంట్లు చేశారు నారా లోకేష్.


ముఖ్యంగా ఎన్నికల ముందు నారా లోకేష్ చేసిన దావోస్ పర్యటన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకపక్క సీఎం చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేసిన బిజెపికి వ్యతిరేకంగా దేశంలో కూటమి ఇక్కడ కంటే మరో పక్క ఆయన తనయుడు నారా లోకేష్ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పడుతున్న కష్టం నిజంగా అభినందనీయమని అంటున్నారు చాలా మంది తెలుగుదేశం పార్టీ వారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: