చంద్రబాబు దర్శకత్వంలో ఏర్పడ్డ 'కర్ణాటక సంకీర్ణం' చట్టు బండలు కానుందా?

బలవంతపు పెళ్ళి చిరకాలం నిలవదు. ఏదైనా బలవంతంగా చేస్తే విపత్కర పరిణామాల్లో అది నిలవదు. ఏదో బిజెపిని అధికారంలోకి రానివ్వ కూడదు అనే ఒకేఒక ఆశయంతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి చేసిన అనాలోచిత నిర్ణయం కర్ణాటకలో ఏర్పడ్డ జెడిఎస్-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం. ఏ సంఖ్యాబలం ప్రకారం జేడిఎస్ ముఖ్యమంత్రి అర్హత సాధించింది? ప్రజలు ప్రభుత్వం ఏర్పరచమని బిజేపికి మరియు కాంగ్రెస్ కు మాత్రమే అవకాశం ఇచ్చారు. కాని ఏ అర్హత లేని జెడీఎస్ కాంగ్రెస్ బలహీనతను సొమ్ము చేసుకొని ముఖ్యమంత్రి పీఠంపై తన అభ్యర్ధి హెచ్ డి కుమారస్వామి గౌడను కూర్చో బెట్టింది.  

అందుకే ఇప్పుడు జేడీఎస్‌ లో కలవరం కలకలం మొదలైంది. శనివారం రాత్రి జరిగిన సిఎల్‌పి భేటీలో సిద్దరామయ్య, పరమేశ్వర్‌ల సమక్షం లోనే పలువురు ఎమ్మెల్యేలు జేడీఎస్‌ నేతల తీరు ను తూర్పారబట్టటం జరిగింది. అంతే కాక ముఖ్యమంత్రి కుమారస్వామి రాజీనామాను కోరడం జేడీఎస్‌కు మింగుడు పడని వెలగపండుగా మారింది. ఒకేసారి 20 మంది వరకు ఎమ్మెల్యేలు ఇదే డిమాండ్‌ చేసినట్లు సమాచారం.

ప్రస్తుతం బీజేపీ గూటికి ఎవరూ వెళ్ళకుండా కాంగ్రెస్‌ నేతలు తమ ఎమ్మెల్యేలను రిసార్ట్‌లో ఉంచగా, ఎకాయకీ ముఖ్యమంత్రినే మార్చాలనే డిమాండ్‌ రావడంతో ఇరు పార్టీ నేతల్లో గుబులు ఆందోళన మిన్ను ముట్టింది. ఎనిమిది నెలలుగా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఎటువంటి ప్రగతి సాధించలేక పోయామనే విషయాన్ని సాకుగా చూపి ముఖ్యమంత్రి  రాజీనామాను కోరి నట్లు తెలుస్తోంది. ఇరుపార్టీలలో స్వల్ప విభేదాలు ఆరంభం నుంచే కొనసాగుతున్నాయి. గెలవక పోతే పర్వాలేదు గెలిచి కూడా ఆ అధికారాన్ని పక్కవాడు అనుభవిస్తుంటే నిశ్శబ్ధంగా పుక్కట గా  చూస్తూ  కూర్చోవటం రాజకీయ నాయకులకు సాధ్యమా? అసలే ఇది కలికాలం.
 
కుమారస్వామి పలుమార్లు కంటతడి పెట్టడమే కాక, కాంగ్రెస్‌ ఒత్తిళ్ళకు తట్టుకోలేక పోతున్నానని, ప్రశాంతంగా పాలన అందించలేక పోతున్నానని, తానో గుమాస్తాగా మారానని ఆరోపించిన విషయం తెలిసిందే కదా! ఎంత కాలం కలుసుంటామో? అనే అనుమానాన్ని అసహనాన్నిసైతం వ్యక్తం చేశారు. కుమారస్వామి. ఆయన ఆలోచనకు తగ్గట్టుగానే  కాంగ్రెస్ వారు రాజీనామాను కోరడం జేడీఎస్‌ నేతల ఆగ్రహానికి కారణమైంది. 

ఒకటి రెండు రోజుల్లోనే జేడీఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు జేడీఎస్ పితామహుడు దేవేగౌడను కలిసి ఇటువంటి అవమానాలు ఎలా? తట్టుకోవాలనే విషయమై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ నేతలు ఇదే విషయమై ఆదివారం పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి వేణుగోపాల్‌ సమక్షంలో చర్చలు జరపాలని భావించగా అంతలోనే ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ  చోటుచేసు కోవడంతో సమావేశమే లేకుండా ముగిసిపోయింది. సంకీర్ణ ప్రభుత్వంలో ఎనిమిది నెలలుగా విభేదాలు ఉన్నా ఇంతటి విపత్కరమైన పరిణామం చోటు చేసుకోలేదు. తాము సంకీర్ణాన్ని నడపలేక ఆ వైఫల్యాన్ని బిజెపీ మీద నెట్టటానికి ప్రయత్నిస్తున్నారని ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు.  రెండు పార్టీలు కలసి ఒక రాష్ట్రంలో సంకీర్ణాన్ని సరిగా  నడప లేని వాళ్ళు 26 పార్టీలతో మాహాకూటమి పేరుతో కేంద్రాన్ని ఎలా నడపగలరు? ఇది ప్రజల్లో తలెత్తే తొలిప్రశ్న.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: