ఏపి ప్రభుత్వానికి హైకోర్ట్ ఝలక్ - కొడి కత్తి కేసు విచారణకు "స్టే కి నో"

రోజురోజుకు నీతి నియమాలు చచ్చిపోతున్నాయి. రాష్ట్రంలో అనేక సందర్భాల్లో సాధారణ ప్రజలకు సాధారణ న్యాయ సూత్రాలను సైతం వర్తింప జేయలేకపోతున్నారు. ప్రపంచ ప్రఖ్యాత రాజధాని అంటూ అమరావతిని చిత్రాల్లో చూపిస్తూ గత నాలుగన్నరేళ్ళ కాలం గడపటం అత్యంత ఆశ్చర్యకరం. అలాగే పదేళ్ళ పాటు హైదరాబాద్ ను రెండు రాష్ట్రాలు సంయుక్తంగా  వినియోగించు కొంటూ క్రమంగా నూతన రాజధాని నిర్మించుకోవటం ఏమాత్రం అసాధ్యం కాదు. అలాంటిది ఏ న్యాయ సూత్రాల ప్రకారం ఏపి హైదరాబాద్ ను వదిలేసింది?  ఇలాగే ప్రతి వ్యవహారం సాధారణ న్యాయానికి అనతి దూరంలో ఉండటం అత్యంత దయనీయం. 

ఆఖరికి రాష్ట్ర ప్రతిపక్ష నాయకునిపై హత్యాప్రయత్నం జరగటం దాని విచారణపై నీలినీడలు కమ్ముకోవటం రాష్ట్రంలోని పాలన స్వరూప స్వభావాలు తెలుపుతున్నాయి. భాదితుడైన ప్రతిపక్ష నేత కోరికను మన్నించి దీనిపై ఎన్ఐఏ దర్యాప్తును స్వయంగా హైకోర్టే  కేంద్రం ఈ విషయంలో ముందుకు వస్తుందా? లేదా ఆ బాధ్యత న్యాయస్థానం తీసుకోవాలా? అని ప్రశ్నించి నప్పుడే కేంద్రం ఎన్ఐఏ దర్యాప్తును అదేశించింది. అలాంటప్పుడు ఆ విచారణలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల సమస్య ఎక్కడ\? ఒక రాజ్యాంగ వ్యవస్థ మరో రాజ్యాంగ నిర్మిత సంస్థను విచారించమంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమిటి?  నేరస్తుడు ఎవరు?  ఎవరి పనుపున ఈ నేరం అమలు జరపబడింది?  పాత్రధారి ఎవరు? సూత్రధారి ఎవరు? ఆ విచారణ ఎవరు చెస్తే ఏమిటి? బాధితునికి జరగాల్సింది న్యాయం. రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరాల్సింది అదే కదా!

దీని పూర్వ రంగంలో ఆపరేషన్ గరుడ అంటూ సినీ నటుడు శివాజి ముందుగానే ప్రధాన మీడియా ద్వారా వైట్-బోర్డ్ పై బొమ్మలేసి మరీ వివరించి  చెప్పినట్లు ప్రతిపక్షనేతపై హత్యా ప్రయత్నం జరిగింది. అలా ఆయన చెప్పటం, అదే అలవరసలపై నేరం జరిగిపోయాయి. అందుకే ఆ జోస్యం లోని పూర్వా పరాలు విచారించకపోతే దాని వెనకేమైనా దేశద్రోహ చర్య ఉందా? అనేది జాతీయ స్థాయిలో విధులు నిర్వర్తించే ఎన్ఐఏ మాత్రమే విచారణ జరపటం చాలా అవసరం. ఇలాంటి కీలక కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నుంచి తప్పించాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో స్టే పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తొలి నుంచీ ప్రజల్లో ఇందులో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉంది అనే అనుమానం అగ్నిలా చెలరేగింది.      

అయితే ఈ రోజు హైకోర్ట్ లో ఏపీ ప్రతిపక్ష నేత, వైసిపి అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డి పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్న సంఘటన కేసులో మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈ కేసును ఎన్‌ఐఏ నుంచి తప్పించాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టు లో విచారణ నిలిపివేయాలని కోరటంలోని ఔచిత్యాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం ఈ పరిస్థితుల్లో  "స్టే" ను నిరాకరిస్తూ కేసును కొట్టివేసింది.

ఈ నెల 30 లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు వివరాలను కూడా కోర్టు ముందు పెట్టాలని ఎన్‌ఐఏ కు ఆదేశాలు జారీ చేయటం తో హైకోర్టు ఈ కేసు విచారణను బహుశ పర్యవేక్స్షించ నున్నదని పరిశీలకుల అభిప్రాయం.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: